మంత్రి అనీల్ జన్మదినం సందర్భంగా చీరల పంపిణీ
మంత్రి అనీల్ జన్మదినం సందర్భంగా చీరల పంపిణీ
11వ డివిజన్ కార్పొరేటర్ గోతం.అరుణ బాలకృష్ణ
నెల్లూరు నగరం, మార్చి 23 (సదా మీకోసం) :
నగరంలోని 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా ఆ డివిజన్ కార్పొరేటర్ గోతం అరుణ బాలకృష్ణ కేక్ కట్ చేసి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం డివిజన్లో పనిచేస్తున్న మున్సిపాలిటీ కార్మికులు ఒక్కొక్క కుటుంబానికి రెండు చీరల చొప్పున పంపిణీ చేశారు.
కార్యక్రమంలో వైసీపీ నేతలు పి.షాకేశ్ రెడ్డి, ఎస్.మహేష్, సిహెచ్. కొండయ్య, ఊ.శ్రీను, జి.తిరుపాల్, సంక్రాంతి. రమేష్, పి.వెంకటేశ్వర్లు, అఖిల్, ఆవుల సుప్రియ, సులోచన, సుభాషిణి, మున్సిపాలిటి సిబ్బంది పాల్గొన్నారు.