ఎప్పుడు ఎన్నికలు జరిగిన వైసిపి ప్రభుత్వం గల్లంతవ్వడం ఖాయం : కోటంరెడ్డి

0
Spread the love

ఎప్పుడు ఎన్నికలు జరిగిన వైసిపి ప్రభుత్వం గల్లంతవ్వడం ఖాయం

బాదుడే బాదుడులో టిడిపి సిటీ ఇంచార్జ్ కోటంరెడ్డి

-: నెల్లూరు నగరం జూలై 3 సదా మీకోసం) :-

రాష్ట్రంలో ఈ క్షణాన ఎన్నికలు జరిగినా వైసిపి ప్రభుత్వం అడ్రస్ గల్లంతవుతుందని టిడిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు జోస్యం చెప్పారు..

బాదుడే బాదుడు కార్యక్రమములో భాగంగా 54 డివిజన్లోని జనార్దన్ రెడ్డి కాలనీలో ఆయన పర్యటించారు..

ఈ సందర్భంగా స్థానిక మాజీ కార్పొరేటర్ జహీర్ ఆధ్వర్యంలో కోటంరెడ్డికి ఘన స్వాగతం లభించింది.. కోటంరెడ్డి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు..

ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మీడియాతో మాట్లాడారు…

బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజల్లో విశేష స్పందన వస్తుందన్నారు..

వైసిపి ప్రభుత్వాన్ని, మాజీ మంత్రి అనిల్ ని ప్రజలు విపరీతంగా తిడుతున్నారని… తాము రెండు తిడితే ప్రజలు నాలుగు తిడుతున్నారని వెల్లడించారు..

చెత్త పన్ను దగ్గరనుంచి కరెంటు బిల్లులు ఆర్టీసీ చార్జీలు, నిత్యవసర ధరలు విపరీతంగా పెంచేశారని కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు..

ప్రజల ఓట్లతో గెలిచిన మాజీ మంత్రి అనిల్ 3000 కోట్ల రూపాయలు సంపాదించి ప్రజలను పట్టించుకోవడమే మానేశాడని మండిపడ్డారు..

ప్రజల్లో తిరిగితే ఎక్కడ కొడతారో అనే భయంతోనే చెన్నైలో దాక్కున్నాడని విమర్శించారు..

అవినీతి సొమ్ముతో నెల్లూరులో రెండు ఇల్లులు, చెన్నైలో మరో ఇల్లు కట్టించుకుని సిటిలో తిరగడమే మానేశాడని ధ్వజమెత్తారు..

చంద్రబాబు నాయుడిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన దిమా వ్యక్తం చేశారు..

యువ నాయకుడు లోకేష్ బాబు సారధ్యంలో మరోసారి టిడిపి అధికారంలోకి రాబోతుందని… చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కోటంరెడ్డి అన్నారు…

బాదుడే బాదుడు కార్యక్రమంలో నగర మహిళా అధ్యక్షురాలు రేవతి, మాజీ కార్పొరేటర్ జహీర్, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు..

మదనపల్లి మినీ మహానాడు పరిశీలకులుగా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గ మినీ మహానాడు పరిశీలకులుగా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని అధిష్టానం నియమించింది..

ఈనెల ఆరో తేదీన జరగబోయే ఈ కార్యక్రమానికి కోటంరెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు..

ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ… మినీ మహానాడు విజయవంతం అయ్యేందుకు కృషి చేస్తానని… స్థానిక నాయకులతో సమావేశమై వైసీపీ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు కృషి చేస్తానని వెల్లడించారు….

కార్యక్రమంలో జనపల సుధీర్, చంద్ర, రషీద్, మున్నా, బాబు, సమీమ్, ఖదీర్ బాషా, కప్పిర శ్రీనివాసులు, కువ్వరపు బాలాజీ, రేవతి, వెంకయ్య యాదవ్ (బాబులు), బాబు గౌడ్, పెంచలయ్య, నారా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!