“సేవ్ ఇండియాసేవ్ వర్కింగ్ క్లాస్ సేవ్ పీపుల్” అంటున్నసిఐటియు
-: నెల్లూరు రూరల్, ఆగస్టు 9 (సదా మీకోసం) :-
కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ “సేవ్ ఇండియాసేవ్ వర్కింగ్ క్లాస్ సేవ్ పీపుల్” నినాదంతో కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు నెల్లూరు రూరల్ పరిధిలోని 21 22 డివిజన్ల సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మారెడ్డి గుంట సెంటర్ నందు గల ప్రభుత్వ ఫ్యాక్టరీ కమిషనర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి నెల్లూరు రూరల్ సిఐటియు కార్యదర్శివర్గ సభ్యుడు కిన్నర కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసే యజమానులకు బానిసలుగా మార్చిందన్నారు.
మోడీ ప్రభుత్వం పేదలను గంట కొట్టమని, దీపాలు వెలిగించి మని చెప్పి కార్పొరేట్ కంపెనీలకు లక్ష కోట్ల రాయితీలు ఇచ్చి ప్రజలను ఆకలితో మాడ్చoదన్నారు.
లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డా కార్మిక కుటుంబాలకు నెలకు పదివేల రూపాయలు చొప్పున ఆరు నెలలు ఇవ్వాలని మనిషికి నెలకు 10 కిలోల రేషన్ ఇవ్వాలని, కార్మిక చట్టాలలో కార్మిక వ్యతిరేక మార్పులను రద్దు చేయాలని, భవన నిర్మాణ, రవాణా కార్మికులకు పదివేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి శ్రీనివాసులు, ఎం గురువయ్య, డి శ్రీనివాసులు, మనీ, జనార్ధన్, చెంగయ్య, రామారావు, అరవ అనిల్ తదితరులు పాల్గొన్నారు.