పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పీ ఛైర్మన్
పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పీ ఛైర్మన్
బాలాయపల్లి, సెప్టెంబర్ 30 (సదా మీకోసం):
బాలాయపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కు ముఖ్యఅతిథిగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ పాల్గొన్నారు. మాజీ మంత్రి వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ గురుమూర్తి లతో కలిసి బాలాయపల్లి మండల పరిషత్ కార్యాలయ నూతన భవనమునకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ, దేవి నవరాత్రుల సమయంలో ఒక మంచి కార్యక్రమమైన బాలాయపల్లి మండల పరిషత్ కార్యాలయ నూతన భవన శంకుస్థాపన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
జిల్లా లోని అన్ని మండలాలకు జిల్లా ప్రజా పరిషత్ నిధులు 15వ ఆర్దిక సంఘం, జిల్లా పరిషత్ జనరల్ ఫండ్స్, 15 శాతం ఈఎంఎఫ్ ల ద్వారా మండలాలలో అభివృద్ధి పనులు చేపట్టుటకు నిధులు విడుదల చేస్తామని తెలిపారు.
జిల్లా ప్రజా పరిషత్ 15 వ ఆర్ధిక సంఘ నిధులతో, జిల్లా లోని అన్ని నియోజక వర్గములలోని అనేక గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టే క్రమంలో వెంకటగిరి నియోజకవర్గం శాసన సభ్యులు ఆనం రామ నారాయణరెడ్డి సహకారంతో జడ్పీటీసీ, ఎంపీపీ ల సమన్వయంతో, అధికారుల పర్యవేక్షణలో బాలాయపల్లి మండలము లోని మండల పరిషత్ పాత భవనము స్ధానంలో నూతన మండల పరిషత్ భవనాలు నిర్మించుటకు జిల్లా ప్రజా పరిషత్ నిధులు నుండి ఒక కోటి అరవై లక్షల రూపాయలు మంజూరు చేయటకు జరిగింనదని తెలిపారు.
అ భవన నిర్మాణము కొరకు నేడు శంఖుస్థాపన చేయుట ఎంతో సంతోషకరమని తెలిపారు. బాలయపల్లి మండలం నకు జిల్లా ప్రజా పరిషత్ 15 వ ఆర్ధిక సంఘ నిధుల నుండి బోర్ వెల్ కొరకు, సిసి రోడ్ల కొరకు, గ్రావెల్ రోడ్ల దాదాపు 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగినదని తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి లతో కలిసి కోటంబేడు గ్రామం నందు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మెట్టకూరు దనుంజయ రెడ్డి, జడ్పిటిసి సభ్యులు, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, వైయస్ఆర్సీపీ నాయకులు, జిల్లా పరిషత్ సీఈవో గారు, మండలాధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.