చిన్న చిన్న అహాలతో స్నేహాన్ని దూరం చేసుకోవద్దు – అబ్దుల్ అజీజ్

0
Spread the love

చిన్న చిన్న అహాలతో స్నేహాన్ని దూరం చేసుకోవద్దు – అబ్దుల్ అజీజ్

  • స్నేహ బంధం చాలా విలువైనది, చిన్న చిన్న అహాలతో స్నేహాన్ని దూరం చేసుకోవద్దు
  • స్నేహం అనేది జీవిత కాలపు ప్రయాణం, ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించుకోవాలి

-: నెల్లూరు, ఆగష్టు 1 (స‌దా మీకోసం) :-

స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు మరియు స్నేహితుల యొక్క గొప్పతనం తెలుపుతూ, టిడిపి నెల్లూరు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ ఒక వీడియో ను రిలీజ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా3 అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, ప్రతీ మనిషికి భార్య తనలో సగం అంటారని, కానీ మనకు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత భార్య మన జీవితం లోకి వస్తుందని, మనకు 2, 3 ఏళ్ల వయసు నుంచే స్నేహితులు మనతో ఉంటారని అన్నారు.

స్నేహితం అనేది ఒక పవిత్రమైన బంధం అని, దాన్ని వర్చించడానికి ఎటువంటి భాషా సరిపోదని, మనకు సంతోషం వచ్చిన బాధ వచ్చిన, మనం నోరు తెరిచి చెప్పాల్సిన పని లేదని, మన బాడీ లాంగ్వేజ్ తోనే వారు పసిగట్టేస్తారు తెలిపారు.

మనం చెప్పకుండా, మన మనసులో మాట చేపగలిగే గొప్ప గుణం స్నేహితులకు ఉంటుందని, స్నేహితము చాలా విలువైనదని, దానికి వెలకట్టలేమని అన్నారు.

డబ్బులు సహాయం చేస్తే నే కాదు, డబ్బులు లేకుండా సహాయం చేయకపోయినా సరే స్నేహితము చాలా స్వచ్ఛంగా ఉంటుందని అన్నారు.

స్నేహితుల విషయం లో తాను అదృష్టవంతుడనీ, ఎందుకంటే తన చిన్న నాటి స్నేహితులు ఇప్పటికీ కూడా తనతోనే ఉన్నారని, వారు కలిసినప్పుడ‌ల్లా చిన్న వయసులో చేసిన చిలిపి అల్లర్లను నెమరువేసుకుంటారని తెలిపారు.

జీవితం లో కష్టాలు కూడా చూశామని, మా తండ్రి గారు, మా స్నేహితుల తల్లి తండ్రులు చనిపోయినపుడు అందరం కలిసి మెలిసి బాధలు పంచుకున్నామని, అవన్నీ ఎంతో విలువైన జ్ఞాపకాలు అని అన్నారు.

డబ్బు అనేది ఒకసారి ఉంటుందని, ఒకసారి ఉండదని, కానీ స్నేహ బంధం మాత్రం శాశ్వతం అని ఇందులో కూడా చిన్న గొడవలు అలకలు ఉంటాయని వాటిని తక్షణమే పరష్కరించుకునే వాళ్ళం అని అన్నారు.

అలాగే జీవితం లో వచ్చే సమస్యలను కూడా పరిష్కరించుకోవాలని, అది స్నేహితుల తో కావచ్చు, బంధువులతో కావచ్చు, ఎవరితో అయినా సరే, తక్షణమే పరిష్కరించుకోవాలని అన్నారు.

స్నేహ బంధం అనేది జీవిత కాలపు ప్రయాణం అని, ఎవరూ కూడా చిన్న చిన్న ఈగో లకు పోయి స్నేహ బంధాన్ని వదులోకోవద్దని, స్నేహం చాలా విలువైనదని అన్నారు.

చిన్న వయసు నుంచి చాలా మంది స్నేహితులు కలుస్తూనే ఉన్నారని, ఆయనకు చాలా మంది స్నేహితులు ఉన్నారని, తన స్నేహితులు వారి బంధాలు ఇలానే కలకాలం ఉండాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!