ఉచిత విద్యుత్ కు మంగళం పాడే కుట్రలో భాగమే మోటార్లకు మీటర్లు : సోమిరెడ్డి

0
Spread the love

ఉచిత విద్యుత్ కు మంగళం పాడే కుట్రలో భాగమే మోటార్లకు మీటర్లు

  • కేంద్రం నుంచి అదనపు అప్పులు, మీటర్ల కంపెనీలు ఇచ్చే వందల కోట్ల కమీషన్ల కోసమే జగన్ రెడ్డి హడావుడి
  • శ్రీకాకుళం జిల్లాలో మొదట ట్రయల్ అన్నారు..ఇప్పుడేమో ఒక్కో మోటారుకు రూ.15 వేలు నుంచి రూ.25 వేలు బిల్లులేసి రైతుల ఇళ్లకు అతికిస్తున్నారు
  • మోటార్లకు మీటర్లపై ప్రతి జిల్లాలో తిరగబడకుంటే రైతుల మెడకు ఉరితాళ్లే
  • తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట రైతుపోరులో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

-: జగ్గంపేట, జూలై 3 (సదా మీకోసం) :-

మహానుభావుడు ఎన్టీఆర్ కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తే, కృష్ణ, గోదావరి నదులను కలిపిన ఘనత నారా చంద్రబాబు నాయుడికి దక్కింది

శ్రీశైలం, నాగార్జునసాగర్, తెలుగు గంగ ప్రాజెక్టులు రాకముందు రాష్ట్ర ప్రజలకు అన్నం పెట్టింది గోదావరి జిల్లాలే..

అంతటి ఖ్యాతి ఉన్న గోదావరి జిల్లాల్లో ఈ రోజు జగన్ రెడ్డి ప్రభుత్వ తీరుతో క్రాఫ్ హాలిడే ప్రకటించుకునే పరిస్థితులు వచ్చాయి..

మళ్లీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మోటార్లకు మీటర్లు బిగించి రైతుల మెడకు ఉరితాళ్లు బిగించే ప్రయత్నం చేస్తున్నారు..

ఈ మీటర్లతో చాలా దుర్మార్గం జరగబోతున్న పరిస్థితుల్లోనే రైతులను చైతన్యవంతం చేసేందుకు రైతు పోరు చేపట్టాం

రాష్ట్రంలోని 18.40 లక్షల రైతుల మోటార్లకు ఉచిత విద్యుత్ దశాబ్దాలుగా కొనసాగుతోంది

ఆనాడు మొట్ట‌మొద‌ట ఎన్టీఆర్ రైతుల‌కు మీటర్లు రద్దు చేసి రోజుకు 18 గంటల పాటు వాడుకున్నా ఏడాదికి హార్స్ పవర్ కు రూ.50 మాత్రమే చెల్లించే విధానం తెచ్చారు..3 హెచ్ పీ మోటారు కలిగిన రైతు ఏడాదికే రూ.150 చెలిస్తే చాలు

రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉచితం పేరుతో 9 గంట‌లు మాత్రమే వ్యవసాయానికి విద్యుత్ ఇచ్చారు..కానీ రూ.50తో 18 గంట‌లు క‌రెంట్ ఇచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్

ఎన్టీఆర్ హ‌యాంలో ప్రారంభ‌మైన ఉచిత విద్యుత్ చంద్ర‌బాబు నాయుడు, రాజ‌శేఖ‌ర్ రెడ్డి, రోశ‌య్య‌, కిర‌ణ్ కుమార్ రెడ్డి హయాంలలోనూ కొన‌సాగింది

జ‌గ‌న్ రెడ్డి అమ‌లులోకి తెచ్చిన మీట‌ర్ల విధానంతో 3 హార్స్ ప‌వ‌ర్ కి నెల‌కు రూ.15 వేలు, 5 హార్స్ ప‌వ‌ర్ కి రూ.25 వేలు వ‌ర‌కు బిల్లులు వ‌స్తున్నాయి. ఆ బిల్లుల‌ను అధికారులు రైతుల మోటార్ల వ‌ద్ద అతికించి వెళుతున్నారు

రైతుల వ‌ద్ద బ్యాంకు ఖాతాల వివ‌రాలు, ఆధార్ నంబ‌ర్లు సేక‌రించే ప్ర‌య‌త్నం చేశారు..కానీ అక్క‌డి రైతులు ఇవ్వ‌బోమ‌ని తేల్చిచెప్పారు.

రైతులు బిల్లులు క‌డితే వాళ్లు త‌ర్వాత ఆ డ‌బ్బులో బ్యాంకులో వేస్తార‌ట‌..ఈ జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని రైతులు న‌మ్మే ప‌రిస్థితే లేదు..

ఆక్వా విద్యుత్ చార్జీల విషయంలో రైతులను నిలువునా ముంచారు..టీడీపీ ప్రభుత్వ హయాంలో యూనిట్ రూ.5.85గా ఉన్న చార్జీలను చంద్రబాబు నాయుడు రూ.2కి తగ్గించారు

అప్పుడే దానికే బాదుడు బాదుడు అని హేళన చేసిన జగన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే రూ.1.50కి యూనిట్ ఇస్తానని ప్రకటించారు

కానీ రూ.1.50 ముణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఇప్పుడు ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ పేరుతో ఇతర చార్జీలు కలిపి యూనిట్ కు రూ.4.85 బాదేస్తున్నారు.

అన్న‌పూర్ణ లాంటి ఏపీలో రైతుల‌తో దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించిన ఏకైక ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

వ్య‌వ‌సాయం విష‌యంలో ఆయ‌న చెప్పేది ఒక్క‌టీ నిజం కాదు..జ‌గ‌న్ రెడ్డి మ‌న‌స్త‌త్వానికి ఒక‌టే ఒక్క ఉదాహ‌ర‌ణ

ఈ మూడేళ్ల‌లో రైతుల కోసం 1.27 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టామ‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో చూపారు

రైతుల వ‌ద్ద ధాన్యం కొనుగోలు చేసినందుకు 44 వేల కోట్లు ఖ‌ర్చుపెట్టారంట‌..ఇత‌ర పంట‌ల కొనుగోలుకు 7 వేల కోట్లు ఖ‌ర్చుపెట్టారంట‌..అంటే 51 వేల కోట్లు రైతుల ఖ‌ర్చుపెట్టామ‌ని ఆ ప్ర‌క‌ట‌న‌ల్లో గొప్ప‌గా రాసుకున్నారు

రైతుల వ‌ద్ద వ‌డ్లు కొని వాటిని బియ్యం చేసి ఏట్లో పోస్తున్నారా…బియ్యం చేసుకుని ఎఫ్‌సీఐకి అమ్ముకుని డ‌బ్బులు తీసుకోవ‌డం లేదా…సివిల్ స‌ప్ల‌యిస్ కార్పొరేష‌న్ ద్వారా రేష‌న్ బియ్యం పంపిణీ చేసుకోవ‌డం లేదా…అంటే మీరు చెప్పేది రైతుల కోసం 51 వేల కోట్లు ఉచితంగా ఇచ్చారా

బ‌డ్జెట్ లో వ్య‌వ‌సాయ రంగానికి 20 వేల కోట్లు కేటాయించి 7 వేల కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు పెట్టిన ఘన‌త ఈ జ‌గ‌న్ రెడ్డిదే

మైక్రో ఇరిగేష‌న్‌, బిందు తుంప‌ర్ల సేద్యాన్ని జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేయ‌డాన్ని మొన్న అంత‌ర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ ప‌క్కా వివ‌రాల‌తో బ‌ట్ట‌బ‌య‌లు చేసింది

రెండు దశాబ్దాల క్రితం 2002లో అప్ప‌టి సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఇజ్రాయిల్ టెక్నాల‌జీని కుప్పంకు తీసుకువ‌చ్చి బిందు తుంప‌ర్ల సేద్యాన్ని దేశానికి పరిచ‌యం చేసిన విష‌యాన్ని బీబీసీ గుర్తు చేసింది

అటువంటి ఏపీలో మూడేళ్లుగా బిందు తుంపర్ల సేద్యాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం మూతేసిందనే విషయం మేము చెబుతున్నది కాదు..ఇంటర్నషనల్ మీడియా అయిన బీబీసీ చెబుతోంది

సీఎంగా జగన్ రెడ్డి ఇటీవల పేపర్లో ఒక ప్రకటన ఇచ్చారు..అందులో జగన్ మీ బిడ్డ ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికల తర్వాత ఇంకోలా, ఎన్నికల కోసం మరోలా ఉండేవాదు కాదు..మీ బిడ్డకు నిబద్ధత ఉంది..అదే చేస్తాడు అని

జగన్ రెడ్డికి నిబద్ధత ఎక్కడ ఉంది…మద్దతు ధర విషయంలో రైతుల గొంతు కోసేసిన ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు

ఒక్క నెల్లూరు జిల్లాలో మూడు మొదటి పంటలు, రెండు రెండో పంటలు కలిపి రైతులు 3 వేల కోట్లు నష్టపోయారు..

కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్(సీఏసీపీ) నివేదిక ప్రకారం భారతదేశంలో గత ఏడాది కనీస మద్దతు ధరతో పోల్చితే ఏపీలో -11 శాతం, క్వింటాలుకు రూ.213, టన్నుకు రూ.2130 రైతులు నష్టపోయారు

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులు దగా పడుతున్నారని, అంతా దళారుల రాజ్యమైపోతోదని మేం చెప్పడమే కాదు.. మీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు..క్వింటాలుకు రూ.200 రైతులు నష్టపోతున్నారని, తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన ప్రకటించాడు..

కానీ మాలెక్క ప్రకారం రైతులు కోల్పోతున్నది క్వింటాలుకు రూ.200 కాదు..రూ.500 వరకు నష్టపోతున్నారు..

2017-18లో మైక్రో ఇరిగేషన్ కు రూ.1200 కోట్లు ఖర్చుపెట్టి జాతీయ స్థాయిలో ఏపీని అగ్రస్థానంలో నిలిపాం..ఆ తర్వాత ఏడాది ఇంకా ఎక్కువ ఖర్చుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఎన్నికల కోడ్ పేరుతో వైసీపీ పెట్టిన అడ్డంకులతో వెయ్యి కోట్లకే పరిమితమయ్యాం

వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా టార్పాలిన్ పట్ట నుంచి హార్వెస్టర్ వరకు పంపిణీ చేశాం…ఈ మూడేళ్లలో ఒక్కటిచ్చిన పాపాన పోలేదు

మా ప్రభుత్వ హయాంలో రెండేళ్లలో రాష్ట్రంలో రైతులకు 21396 ట్రాక్టర్లు ఇచ్చాం…ఇప్పుడు మూడేళ్ల తర్వాత నాలుగో ఏడాదిలో 3 వేల ట్రాక్టర్లు ఇచ్చామని ఆర్భాటం చేసుకోవడం హాస్యాస్పదం

భూసార పరీక్షలు నిర్వహించి సాయిల్ హెల్త్ కార్డులు జారీ చేయడంతో పాటు సూక్ష్మ పోషకాలు నూరు శాతం సబ్సిడీతో ఉచితంగా అందజేశాం

టీడీపీ హయాంలో ఎకరా వరి సాగుకు పెట్టుబడి రూ.20 వేలు అయితే,, ఇప్పుడు రూ.34 వేలకు పెరిగిపోయింది..కానీ మద్దతు ధర పెంచింది క్వింటాలుకు రూ.100 మాత్రమే..అంటే ఒక్క రైతు ఎకరాకు 2.5 టన్నుల ధాన్యం పండిస్తే అదనంగా వచ్చేది రూ.2500 మాత్రమే

పొరుగునే ఉన్న తెలంగాణలో కేసీఆర్ మొదటి పంటకే కోటి టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మూడో రోజే నగదు జమ చేశారు

రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నారు..ఎన్ని ఎకరాలుంటే అన్ని పది వేళ్లు ఇస్తున్నారు

ఇక్కడ మాత్రం రైతు భరోసా పేరుతో రైతులను దగా చేస్తున్నారు..రైతుకు ఎన్ని ఎకరాలున్నా ఆ కుటుంబానికి రూ.7500 ఇస్తున్నారు…అది కూడా మూడు విడతల్లో

టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ ఇస్తే ఇప్పుడు 7 గంటలు 7 సార్లు కోతలతో ఇస్తున్నారు…తెలంగాణలో 24 గంటలూ విద్యుత్ సరఫరా జరుగుతోంది

త్వరలో రైతులకు 7 గంటల విద్యుత్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు…దేశంలోని తొలి సూపర్ క్రిటికల్ ప్రాజెక్ట్ అయిన క్రిష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టును అదానీ చేతుల్లో పెట్టేస్తున్నారు

నాణ్యమైన దిగుమతి చేసుకునేందుకు అందుబాటులో పోర్టుతో పాటు అనేక సౌకర్యాలున్నప్పటికీ అదానీకీ దాసోహమైపోయారు

చంద్రబాబు బాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ధి రేటు 11.2 శాతంగా ఉంది..ఈ రోజు వ్యవసాయ రంగం ఏమైపోయింది

జాతీయ స్థాయిలో రైతుల తలసరి అప్పు రూ.74 వేలు అయితే మన రాష్ట్రంలో రూ.2.45 లక్షలుగా ఉంది

రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో మూడో స్థానంలో ఉంది….కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉంది

పప్పు, ఉప్పుతో ఏట్లో ఉచితంగా దొరికే ఇసుక కూడా అందనంత ధర పెరిగిపోయింది..ఒక్క రైతు పండించే ధాన్యం ధరలు మాత్రం తగ్గిపోయాయి

జగన్ రెడ్డి చెప్పిన ధరల స్థిరీకరణకు 3 వేల కోట్లు ప్రకృతి విపత్తుల నిధి రూ.4 వేలు కోట్లు ఏమైపోయాయో

అసలే ఏపీలో వ్యవసాయ రంగం కుదేలైన పరిస్థితుల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోం

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో రైతులు తిరగబడి మీటర్లతో వచ్చిన లారీలను వెనక్కిపంపారు..రాష్ట్రంలోని అన్ని జిల్లాల రైతులు అదే బాటలో నడవాలి

జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జరిగిన ఈ రైతు పోరు సభలో పాల్గొన్న యనమల రామక్రిష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, పితాని సత్యనారాయణ, పత్తిపాటి పుల్లారావు, గన్ని ఆంజనేయులు, కేఎస్ జవహర్, దూళిపాళ్ల నరేంద్ర, కూన రవికుమార్, పీతల సుజాత, మాగంటి బాబు, మర్రెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కొండబాబు, బండారు సత్యనారాయణ, రెడ్డి అనంతకుమారి తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!