పార్కును ప్రైవేట్ ప‌రం చేసే ప్రయత్నాలు మానుకోవాలి : 16 వ డివిజన్ అభివృద్ది క‌మిటి

0
Spread the love

పార్కును ప్రైవేట్ ప‌రం చేసే ప్రయత్నాలు మానుకోవాలి

16 వ డివిజన్ అభివృద్ది క‌మిటి

-: నెల్లూరు న‌గ‌రం, మార్చి 27 (స‌దా మీకోసం) :-

ఆదిత్యనగర్ వాటర్ ట్యాంక్ రిజర్వుడ్ స్థలం పార్కును ప్రైవేట్ సంస్థలకు ధారా దత్తం చేసే ప్రయత్నాలను కార్పొరేషన్ విరమించుకోవాలని 16వ డివిజ‌న్ అభివృద్ధి క‌మ‌టి ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న తెలిపారు.

నెల్లూరు నగరం 16 వ డివిజన్ లో ఆదిత్య నగర్ వాటర్ ట్యాంక్ పార్క్ వద్ద ఉన్న రిజ‌ర్వుడ్ స్థ‌లం ను కార్పొరేష‌న్ ప్రైవేటు సంస్థ‌ల‌కు దారాద‌త్తం చేసే ప్ర‌య‌త్నంలో ఉంద‌ని నాయ‌కులు విమ‌ర్శించారు.

ఈ సంద‌ర్భంగా వారు అన్యాక్రాంతం అయిన 10 కోట్ల విలువైన పార్క్ స్థలాన్ని16 వ డివిజన్ ప్రజల పోరాటంతో తిరిగి సాధించుకొన్నామని తెలిపారు.

మన పోరాటంతో కోటి పైన నిధులు మంజూరు చేయించి స్థలం చదును, పార్క్ నిర్మాణ పనులు గత ప్రభుత్వంలోనే ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం, నుడా, కార్పొరేషన్ ప్రజా పార్కు స్థానంలో వ్యాపార దృక్పథంతో తమకు అనుకూలమైన ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు అప్పజెప్పి రుసుము వసూలు చేసేందుకు శిక్షణా సంస్థగా నిర్మాణ పనులు చేపట్టిందని తెలిపారు.

వీటిని వెంటనే విరమించి రిజర్వుడ్ స్థలంలో పిల్లలు, మహిళలు పెద్దలకు ఆహ్లాదకరంగా ఉండే పార్కును మాత్రమే నిర్మించాలని డిమాండ్ చేశారు.

స్టేజి, క్రికెట్ కోసం కేటాయించిన స్థలాలను, పార్క్ అభివృద్ధి, సిట్టింగ్ లాన్స్ కొరకు ఉపయోగపడేలా మార్చాలన్నారు.

మహిళల జిమ్ కొరకు నిర్మించిన రూమ్ నందు వ్యాయమ పరికరాలను ప్రభుత్వమే ఏర్పాటు చేసి ఉచితంగా అందరికి అందుబాటులో ఉంచాలని వాటిని పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు.

వాకింగ్ ట్రాక్ ను గతంలో ప్లాన్ చేసిన విధoగా ప్రహరీ గోడ చుట్టూ కొనసాగించాలని, పార్క్ ప్రవేశం ఉచితంగా ఉండాలని, ప్రజల సౌకర్యార్థం పార్క్ పడమర వైపు రోడ్ నుండి ప్రవేశ మార్గం ఏర్పాటు చేయాలని కోరారు.

కార్యక్రమంలో సిపిఎం మాజీ జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, రామచంద్రారెడ్డి హాస్పిటల్ సూపరింటెండెంట్‌ డాక్టర్ రాజేశ్వరరావు, డాక్టర్ ఎం.వి. రమణయ్య, సిపిఎం 16 వ డివిజన్ సెక్రెటరీ ఆర్‌. శ్రీనివాసులు, బాబు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!