ఘనంగా పల్నాటి నాగేశ్వరరావు 3వ వర్ధంతి సభ

0
Spread the love

ఘనంగా పల్నాటి నాగేశ్వరరావు 3వ వర్ధంతి సభ

  • నాగేశ్వరరావు గారి జయంతి వేడుకలను కూడా జరుపుతాం : మేకపాటి మాల్యాద్రి
  • నాగేశ్వరరావు గారి వర్ధంతిని యూనియన్‌ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుందాం : గట్టుపల్లి శివకుమార్‌
  • నాగేశ్వరరావు గారికి నెల్లూరు జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది : ఉడతా రామకృష్ణ

 

ఒంగోలు, అక్టోబర్‌ 16 (సదా మీకోసం) : ఆంధ్ర ప్రదేశ్‌ ఎడిటర్స్‌ అండ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ (ఏపీఈజేఏ) వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్‌ ఎడిటర్స్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఏపీఈజేయూ) ఏర్పేడేందుకు స్పూర్తి ప్రధాత పల్నాటి నాగేశ్వరరావు 3వ వర్ధంతి సందర్భంగా ఏపీఈజేయూ ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నాడు ఒంగోలు సిపిఐ కార్యాలయంలో ఆయన వర్ధంతి సభ ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఏపీఈజేయూ నాయకులతో పాటు ప్రకాశం జిల్లా విలేఖరులు ఘనంగా నివాళులర్పించారు.

కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ఎడిటర్స్‌ అండ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ ప్రకాశం జిల్లా అధ్యక్షురాలు మల్లీశ్వరి అధ్యక్షత వహించారు.

కళలదండోరా ఎడిటర్‌ అంగలకుర్తి ప్రసాద్‌ మాట్లాడుతూ పల్నాటి నాగేశ్వరరావు గొప్ప సేవాభావం కలిగిన జర్నలిస్ట్‌ నాయకులని, అంతేకాకుండా ఆపదలో ఉన్న జర్నలిస్టులను ఆదుకోవడమే కాకుండా సేవా కార్యక్రమాల చేశారని కోనియాడారు.

రాష్ట్ర అధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి మాట్లాడుతూ గొప్ప మానవతావాదని ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని మీరెవరూ బాధపడవద్దని జర్నలిస్టులకు ఒక భరోసా కల్పించారు.

ఆలాంటి మంచి నాయకుడిని కోల్పోవడం మా యూనియన్‌ దురదృష్టమని అన్నారు.

ఇకనుంచి నాగేశ్వరరావు జయంతి వేడుకలను కూడా జరుపుతామని అంతేకాకుండా నాగేశ్వరరావు పేరు మీద సేవా కార్యక్రమాలు యూనియన్‌ ద్వారా కొనసాగిస్తామని తెలిపారు.

రాష్ట్ర కో-కన్వీనర్‌ గట్టుపల్లి శివకుమార్‌ మాట్లాడుతూ ఇక నుంచి నాగేశ్వరరావు వర్ధంతిని యూనియన్‌ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుందామని రాబోయే రాష్ట్ర కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు.

నాగేశ్వరరావు గారు నెల్లూరుకు వచ్చినప్పుడు మంచి సలహాలు ఇచ్చేవారని తెలిపారు.

నెల్లూరు జిల్లా కన్వీనర్‌ ఉడతా రామకృష్ణ మాట్లాడుతూ, యూనియన్‌ పరంగా పల్నాటి నాగేశ్వరరావు గారికి నెల్లూరు జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు.

అసోసియేషన్‌గా ఉన్న కాలంలో యూనియన్‌ విస్తరణలో భాగంగా నెల్లూరు జిల్లాకే మొదటి సారిగా వచ్చిరని, ఆ తరువాత చివరి సారిగా కూడా నెల్లూరు జిల్లాకే వచ్చారని తెలిపారు.

మాజీ అద్యక్షులు గద్దల శివాజీ, పియన్‌ యం.డి. కిరణ్‌ కుమార్‌, వజ్రాయుధం ఏడిటర్‌ వి.రామకృష్ణ, ప్రకాశం జిల్లా ఎ.పీ.ఈ.జే.ఏ అధ్యక్షులు షేక్‌ కాలేషావలి, ఉపాధ్యక్షులు బొడ్డు శ్రీను, సత్యకేబుల్‌ న్యూస్‌ రీడర్‌ శరత్‌, పి.వై. ఏడుకొండలు పాల్గొని ప్రసంగించారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!