రేపు భారీ వర్షాలతో తల్లడిల్లిన ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
రేపు భారీ వర్షాలతో తల్లడిల్లిన ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
ముందస్తుగా భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన టీడీపీ బృందం
నెల్లూరు ప్రతినిధి, నవంబర్ 23 (సదా మీకోసం) :
జిల్లాలో భారీ వర్షాలతో తల్లడిల్లిన ప్రాంతాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుల బృందం ముందస్తుగా నెల్లూరు జిల్లా లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
మాజీ ఎమ్మెల్యే, నెల్లూరు, ఒంగోలు పార్లమెంట్ల కో ఆర్డినేటర్ బీసీ జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే డా|| డోలా వీరాంజనేయ స్వామి, మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి, దామచర్ల సత్య, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు నగర నియోజకవర్గ ఇంఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలు పర్యటించారు.
చంద్రబాబు నాయుడు రావాల్సిన రూట్ మ్యాప్ ను పరిశీలించి, చంద్రబాబు నాయుడు పర్యటించాల్సిన ప్రాంతాలను పరిశీలించారు.
వారితో పాటు జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్,నన్నే సాహెబ్, రేవతి, సుజన్, సుబహాన్ తదితరులు పాల్గొన్నారు.