పలనాటి నాగేశ్వరరావుకు ఘన నివాళి
ఏపీఈజేయూ ఆధ్వర్యంలో 6వ వర్ధంతి సభ
మానవతావాది పల్నాటి నాగేశ్వరావు
ఒంగోలు, అక్టోబర్ 18 (సదా మీకోసం) :
ఒంగోలు పట్టణంలోని ఎంసీఏ భవన్ లో ఏపీఈజేఏ వ్యవస్థాపకులు, ఏపీఈజేయు ఏర్పాటుకు ప్రేరేపించిన వ్యక్తి, గొప్ప మానవతావాది పల్నాటి నాగేశ్వరరావు 6వ వర్ధంతి సభ ఏపీఈజేయూ ఆధ్వర్యంలో నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కన్వీనర్ మేకపాటి మాల్యాద్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్నాటి నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, సంఘ సేవకుడు, జర్నలిస్టు, మానవతావాది స్వర్గీయ పల్నాటి నాగేశ్వరావుకు ఏపీఈజేయుకు ఎనలేని అనుబంధం ఉందని, ఏపీఈజేఏకు ఆయన ఒక వ్యవస్థాపక అధ్యక్షుడు అని, ఆయన సేవలు మరువలేనివనీ కొనియాడారు.
నాగేశ్వరరావు మన మధ్య లేకపోయినా మనందరి అభివృద్ధిని కోరుకునే వ్యక్తి అని అన్నారు. ఆయన చేసిన సేవలు నేటికీ ఎవరు మరువలేదని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఏపీఈజేయు ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంధ్రకలం సంపాదకుడు ఈర్ల శ్రీనివాసరావు, స్వాతి కిరణం రిపోర్టర్ సంజీవరావు, వజ్రాయుధం ఎడిటర్ మంకాల రామకృష్ణ, 99 రిపోర్టర్ బొడ్డు శ్రీనివాసరావు, వాణి న్యూస్ ఎడిటర్ జోగి శ్రీనివాసరావు, నేటి ఆయుధం స్టేట్ బ్యూరో ఎస్కే కాలేజ్ షావలి, వారధి ఛానల్ రిపోర్టర్ కోరుకొండ సుబ్బారావు, జనం గుండె చప్పుడు ఎడిటర్ ఆనంద్, పల్నాటి నాగేశ్వరరావు చిన్ననాటి మిత్రుడు శ్రీనివాసులు, మెట్రో టీవీ రిపోర్టర్ బాషా, కలల దండోరా ఎడిటర్ అంగలు కుర్తి ప్రసాద్ తదితరులు పాల్గొని నాగేశ్వరరావు ఔన్నత్యాన్ని గుర్తుచేసుకొని ఘన నివాళి అర్పించారు.





