దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి
దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి
- – దినపత్రికలు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాయి
- – పత్రికల జర్నలిస్టులపై కొందరి అధికారుల తీరు గర్హనీయం
- – అక్రిడిటేషన్ జర్నలిస్టులకు ప్రామాణికం కాదు
- – రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందటానికి మాత్రమే కొలమానం
- – సమాచార సేకరణకు పత్రికల యాజమాన్యాలు ఐడీ కార్డు చాలు
- – వారిని జర్నలిస్టులు కాదని చెప్పడం సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించినట్లే
- – దినపత్రికల జర్నలిస్టులపై వివక్ష చూపితే సహించేది లేదు
- – నెల్లూరు జిల్లా దినపత్రికల ఎడిటర్స్ ఐక్య వేదిక వెల్లడి
- – జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీడీ ఐ అండ్ పీఆర్ లకు వినతి పత్రాలు అందజేత
- – సానుకూలంగా స్పందించిన అధికారులు.. చర్యలు తీసుకుంటామని హామీ
నెల్లూరు ప్రతినిధి, ఫిబ్రవరి 11 (సదా మీకోసం) :
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో దినపత్రికలకు సంబంధించిన జర్నలిస్టులపై కొందరు జర్నలిస్టులు, అధికారులు చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించాలని నెల్లూరు జిల్లా దినపత్రికల ఎడిటర్స్ ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఇటీవల ఆత్మకూరు కేంద్రంగా కొందరు జర్నలిస్టులు అత్యుత్సాహంతో మండలాలకు వెళ్లి అక్రిడిటేషన్ ఉన్న వారు మాత్రమే జర్నలిస్టులు అని మిగిలిన వారు జర్నలిస్టులు కాదని చేస్తున్న దుష్ప్రచారాన్ని వారు ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని క్షేత్ర స్థాయిలో నివారించాలని కోరురూ శుక్రవారం జిల్లా కలెక్టర్ కే.వీ.ఎన్. చక్రధర్ బాబు, జిల్లా ఎస్పీ విజయరావు, సమాచార, పౌర సంబంధాల శాఖ డీడీ ఎం. వెంకటేశ్వర ప్రసాద్ లకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఎడిటర్స్ మాట్లాడుతూ. కొందరి జర్నలిస్టుల, అధికారుల ప్రవర్తన బాధాకరం అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి దినపత్రికలు నడుపుకోవడానికి అనుమతులు తీసుకుని పత్రిక లు నిర్వహించు కుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు తమ దినపత్రికల జర్నలిస్టుల మీద ఎటువంటి ఆరోపణలు రాలేదని స్పష్టం చేశారు. స్థానిక దినపత్రికలకు ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల ప్రకారం మొదటి విడతగా రెండు అక్రిడిటేషన్లు ఇచ్చిన నేపథ్యంలో సంపాదకునికి ఒకటి, బ్యూరో ఇన్చార్జ్ కు ఒకటి ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. మున్సిపాలిటీలు, మండలాలలో పనిచేస్తున్న విలేకర్లకు సంస్థ ఐడీ కార్డును మంజూరు చేశామన్నారు. కానీ ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని కొందరు అధికారులు ఇటీవల కాలంలో దినపత్రికల జర్నలిస్టుల పట్ల చులకనగా మాట్లాడుతున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. ఆత్మకూరు మండల సమావేశంలో ఒక మండల అధికారి, అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులు మాత్రమే ఉండాలని, మిగిలిన వారు బయటకు వెళ్లాలని చెప్పారని, మరో అధికారి ఏకంగా నియోజకవర్గ పరిధిలోని అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టుల జాబితాను ఒక వాట్సప్ గ్రూపులో పోస్ట్ చేయడం బాధాకరం అన్నారు. ఇటువంటి పరిస్థితులు మరళా పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, విజ్ఞప్తి చేశారు. మరోసారి అక్రిడిటేషన్, నాన్ అక్రిడిటేషన్ అనే విధంగా ప్రచారం చేయవద్దని, ఇది అంతర్గత విభేధాలకు దారి తీస్తుందని నెల్లూరు జిల్లా దినపత్రికల ఎడిటర్స్ ఐక్య వేదిక నేతలు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో దిన పత్రిక ల ఎడిటర్లు వల్లూరు ప్రసాద్ కుమార్ (అంతిమ తీర్పు), ఉడతా రామకృష్ణ (సదా మీకోసం), శాఖమూరి శ్రీనివాసులు (అభయం), షేక్. గౌస్ భాష (సింహపురి టుడే), ఉడతా శరత్ యాదవ్ (షోకాజ్), షేక్. రఫీ (చేయూత), మల్లు రాజేంద్ర ప్రసాద్ (నిజమైన నేస్తం), శేష గిరి (ఇది నిజం), సోలా ప్రసాద్ (లైఫ్ లైన్ పారడైజ్), పెన్నా తీరం ప్రతిక తరపున డి.వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.