స్థానిక పత్రికలకు అన్ని విధాలుగా సహకరిస్తాం

0
Spread the love

స్థానిక పత్రికలకు అన్ని విధాలుగా సహకరిస్తాం

  • కలెక్టర్ సహకారంతో స్థానిక పత్రికలకు యాడ్స్ మంజూరు చేశాం
  • ప్రభుత్వ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి
  • పీరియడికల్స్ కు స్టేట్ పాస్ పై కలెక్టర్ దృష్టికి తీసుకెళతాం
  • సమాచార, పౌర సంబంధాల శాఖ డీడీ వెంకటేశ్వర ప్రసాద్

నెల్లూరు ప్ర‌తినిధి, జ‌న‌వ‌రి 11 (స‌దా మీకోసం) :

సమాచార, పౌర సంబంధాల శాఖ ద్వారా స్థానిక పత్రికలకు అన్ని విధాలుగా సహయ, సహకారాలు అందిస్తామని ఆ శాఖ ఉప సంచాలకులు ఎమ్. వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని రేబాల లక్ష్మీ నర్సారెడ్డి జూనియర్ ఏసీ మందిరంలో‌ ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్, కో – కన్వీనర్ మేకపాటి మాల్యాద్రి, గట్టుపల్లి శివకుమార్ లు అధ్యక్షతన జరిగిన యూనియన్ రెండవ జిల్లా మహాసభకు ముఖ్య అథిదిగా నెల్లూరు జిల్లా ఉప సంచాలకులు, సీనియర్ సంపాదకులు వేల్పుల శేష చలపతి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ కారణంగా గత ఏడాదిన్నరగా జర్నలిజం తీవ్ర ఒడుదుడుకులు ఎదుర్కొనిందని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ సహకారంతో దరఖాస్తు చేసుకున్న అన్ని స్థానిక పత్రికలకు యాడ్స్ మంజూరు చేశామని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ పత్రికలను నడుపుకోవాలని సూచించారు. మాస, పక్ష, వార దినపత్రికల సంపాదకులకు స్టేట్ బస్ పాస్ మంజూరు చేయాలని పలువురు కోరారని, దీనిని కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళతానని వెల్లడించారు. యూనియన్ రాష్ట్ర కన్వీనర్ మేకపాటి మాల్యాద్రి నాయుడు, సీనియర్ సంపాదకులు వేల్పుల శేషాచల పతి, రాష్ట్ర కో – కన్వీనర్ గట్టుపల్లి శివకుమార్ లు మాట్లాడుతూ స్థానిక పత్రికల సంపాదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా పత్రికలు నిర్వహించుకుంటున్నారని తెలిపారు. కానీ ప్రభుత్వాలు మాత్రం కార్పొరేట్ సంస్థల ద్వారా నడుస్తున్న దినపత్రికలకు అగ్రతాంబూలం వేస్తూ, స్థానిక పత్రికలపై సవతి తల్లి ప్రేమ తగదన్నారు. స్థానిక పత్రికలను ఆదుకోవాలని సమాచార, పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకుల ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమం ముందుగా కోవిడ్ ప్రారంభం నుంచి అసువులు బాసిన జర్నలిస్టులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు.

నూతన జిల్లా కమిటీ ఎన్నిక

జిల్లా మహాసభ అనంతరం నూతన జిల్లా కమిటీని రాష్ట్ర కన్వీనర్‌, కో- కన్వీనర్‌ లు ప్రకటించారు.

గౌరవాధ్య‌క్షులుగా : కోట సునీల్ కుమార్ (క్లాక్ ఆఫ్ నెల్లూరు – సి.ఇ.ఓ),

గౌరవ సలహాదారులుగా : గూండాల ప్ర‌తాప్ రెడ్డి (గ్రేట‌ర్ నెల్లూరు పత్రిక – సంపాదకులు),

న్యాయ సలహాదారులుగా :  మద్దిబోయిన సుందరయ్య యాదవ్ (సదా మీ కోసం దిన పత్రిక – లీగ‌ల్ రిపోర్ట‌ర్‌)

                             చప్పిడి తిరుమలేష్ (పెన్నాతీర‌మ్ దిన‌ పత్రిక – సంపాదకులు), లు

ఏకగ్రీవంగా నియమితులయ్యారు.

 

జిల్లా అధ్యక్షులుగా : ఉడతా రామకృష్ణ (సదా మీ కోసం దిన పత్రిక – సంపాదకులు),

ప్రధాన కార్యదర్శిగా : పిగిలం నాగేంద్ర (జనహుషార్ పత్రిక – సంపాదకులు),

వర్కింగ్ ప్రెసిడెంట్ గా :  వెలసిరి కుమార్ (ధర్మక్షేత్రం పత్రిక – సంపాదకులు),

కోశాధికారిగా : తుమ్మా రమేష్ (చదరంగం పత్రిక – సంపాదకులు) నియమితులయ్యారు.

 

ఉపాధ్యక్షులుగా :

సుంకర సుధాకర్ (మాన‌వ క‌ళ్యాణం పత్రిక – సంపాదకులు),

డీ. వరప్రసాద్ (పెన్నాతీర‌మ్ దిన‌ పత్రిక – భ్యూరో),

చీదెళ్ల సరళ (జై భార‌త‌మాత‌ పత్రిక – సంపాదకులు),

పీ వెంకటరామిరెడ్డి (వార్తా త‌రంగం పత్రిక – సంపాదకులు),

కే. ఉదయ్ కుమార్ రెడ్డి (విజ్ఞాన్‌ పత్రిక – సంపాదకులు),

చేవూరు చిన్నా (ప్ర‌జాకాంక్ష పత్రిక – స్టాఫ్ రిపోర్ట‌ర్‌)

లు నియమితులయ్యారు.

 

సహాయ కార్యదర్శులుగా

వీ. మధుసూదన రావు (PV న్యూస్ – సి.ఇ.ఓ),

షేక్ అలీ (ప్ర‌జాధ్యేయం దిన‌ పత్రిక – సంపాదకులు),

షేక్ రిజ్వాన్ (స్ప్రెడ్ న్యూస్‌ పత్రిక – రిపోర్ట‌ర్‌),

ఎస్. కామేశ్వరరావు (షోకాజ్ దిన‌ పత్రిక – స్టాఫ్ రిపోర్ట‌ర్‌),

కూచి వెంకట సురేష్ (అక్ష‌ర భూమి దిన‌ పత్రిక – స్టాఫ్ రిపోర్ట‌ర్‌),

సయ్యద్ సలీమ్ (షోకాజ్ దిన‌ పత్రిక – రిపోర్ట‌ర్‌),

ఆవుల వెంకటేశ్వర్లు (సదా మీ కోసం దిన పత్రిక – డివిజ‌న‌ల్‌ రిపోర్ట‌ర్‌)

నియమితులయ్యారు.

కార్యవర్గ సభ్యులుగా

పీ. చక్రధర్ (RNA – ఫోటో గ్రాఫ‌ర్‌),

రాశిరాజు శారధ (శివ‌తాండ‌వం మాస ప‌త్రిక – రిపోర్ట‌ర్‌),

షేక్ జావీద్ (నిప్పులాంటి వార్త మాస పత్రిక – రిపోర్ట‌ర్‌),

కూరాకు గోపీ (షోకాజ్ దిన‌ పత్రిక – రిపోర్ట‌ర్‌),

షేక్ జకావుల్లా (సదా మీ కోసం మాస పత్రిక – రిపోర్ట‌ర్‌),

సీహెచ్ శివ (శివ‌తాండ‌వం మాస ప‌త్రిక – రిపోర్ట‌ర్‌),

మావిళ్ల ఆనంద్ (పెన్నాతీర‌మ్ దిన‌ పత్రిక – డివిజ‌న‌ల్‌ రిపోర్ట‌ర్‌)

నియమితులయ్యారు.

 

ఈ కార్యక్రమం లో యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకులు శరత్ యాదవ్, రమేష్ రెడ్డి, ఎస్.డి. జావీద్, చిత్తూరు జిల్లా నాయకులు రాజా రెడ్డి, ఒంగోలు జిల్లా అధ్యక్షురాలు మల్లేశ్వరి, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

          

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!