స్వాతంత్ర పోరాటంలో అమరవీరుల త్యాగాలు మరువలేనివి : జేడీ లక్ష్మీనారాయణ
స్వాతంత్ర పోరాటంలో అమరవీరుల త్యాగాలు మరువలేనివి
-: జేడీ లక్ష్మీనారాయణ :-
నెల్లూరు, మార్చి 23 (సదా మీకోసం) :
పౌరుషానికి, త్యాగానికి, స్వతంత్ర స్వేచ్చకు ప్రతీకగా ప్రజల గుండెల్లో నిలిచిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ నిజమైన అమరులని మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు.
జె.డి.ఫౌండేషన్, పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నెల్లూరు జాకీర్ హుస్సేన్ నగర్ లోని ఎస్.వి.ఆర్. హైస్కూల్ నందు అమరవీరుల దినం సందర్భంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల చిట్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వి.వి.లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ చిన్న వయసులో దేశ స్వాతంత్రం కోసం ముగ్గురు యువకులు ప్రాణాలను అర్పించిన మార్చి 23వ తేదీని అమర వీరుల దినంగా పాటిస్తూ దేశం మొత్తం అంజలి ఘటిస్తున్నదని వివరించారు.
కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ అందే శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ బి.రమేష్ బాబు, పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.మురళీమోహన్ రాజు, కరోనా వైద్యులు బొనిగి ఆనందయ్య, న్యాయవాది డి.విజయ నిర్మల, విజయలక్ష్మి, వై.చంద్రశేఖర్ రెడ్డి, అందే రాము, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.