చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ గెలిస్తే 3 రాజధానులు నిర్ణయం తప్పని ఒప్పుకుంటాం : మంత్రి అనిల్
చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ గెలిస్తే 3 రాజధానులు నిర్ణయం తప్పని ఒప్పుకుంటాం : మంత్రి అనిల్
-: అమరావతి, ఆగస్టు 3 (సదా మీకోసం) :-
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అనిల్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని సీఎం జగన్ చూస్తుంటే చంద్రబాబు ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు.
అభివృద్ధి ఒకే ప్రాంతంలో కేంద్రీ కృతమైతే ప్రాంతీయ అసమానతలు వస్తాయన్నారు.
అమరావతిని ఎక్కడా రాజధానిగా తీసివేయలేదనీ, అమరావతికి అదనంగా మరొక రెండు రాజధానులు వస్తున్నాయన్నారు.
అమరావతిని రియల్ ఎస్టేట్ చంద్రబాబు మార్చివేశారనీ, అభివృద్ధి కోసం నాలుగు ప్రాంతీయ అభివృద్ధి బోర్డ్ లను సీఎం జగన్ ఏర్పాటు చేస్తున్నారన్నారు.
రాజధానికి లక్ష కోట్లు కర్చు అవుతుందనీ, ఎక్కడ నుంచి తేవాలి లక్ష కోట్ల రూపాయలంటూ ప్రశ్నించారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ భూముని రాజధానిగా పెట్టాలని అసెంబ్లీలో చెప్పారన్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయంను రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో కూడా చంద్రబాబు ఇంత రాదంతం చేయలేదన్నారు.
చంద్రబాబు తన బినామిలకు, రియల్ ఎస్టేట్ మాఫియాకు నష్టం వస్తుందని తెలిసి గోగ్గులు పెడుతున్నారని విమర్శించారు.
అమరావతి పై చంద్రబాబు కంటే, జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ప్రేమ ఉందన్నారు.
అమరావతిలో జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నారనీ, చంద్రబాబు ఇల్లు కూడా అమరావతిలో కట్టుకోలేదన్నారు.
చంద్రబాబు కు మంత్రి అనిల్ కుమార్ సవాల్
ప్రభుత్వం నిర్ణయం తప్పు అంటున్న చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలనీ, 23 ఎమ్మెల్యేలు గెలిస్తే మూడు రాజధానులు నిర్ణయం తప్పని ఒప్పుకుంటామన్నారు.
తమ సవాల్ కు చంద్రబాబు నాయుడు స్పందించాలన్నారు.
పవన్ కళ్యాణ్ ఎప్పుడు కన్ఫ్యూజన్ లో ఉంటాడనీ, ఎప్పుడు ఏమి మాట్లాడుతాడో ఎవరికి తెలియదనీ, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం అనవసరమని అన్నారు.
ఒకసారి బీజేపీ అంటాడనీ, మరొక సారి టీడీపీ అంటాడనీ వ్యంగ్యంగా విమర్శించారు.
బీ టెక్ రవి రాజీనామా వలన ఎలాంటి ఉపయోగం లేదనీ, ఆయన స్పూర్తితో టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనీ టిడిపికి పిలుపునిచ్చారు.