రాష్ట్రంలో అరాచక, అబద్దపు, దోపిడిపూరిత అవినీతి పాలన : బీద రవిచంద్ర

Spread the love

రాష్ట్రంలో అరాచక, అబద్దపు, దోపిడిపూరిత అవినీతి పాలన : బీద రవిచంద్ర

  • నాడు మిగులు విద్యుత్ – నేడు విద్యుత్ కొరత రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ది శూన్యం – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర

-: వెంక‌ట‌గిరి, అక్టోబ‌ర్ 13 (స‌దా మీకోసం) :-

వెంకటగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి సోమశిల ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ రాపూరు సుందరరామిరెడ్డి, సీనియర్ నాయకులు గంగోటి నాగేశ్వరరావు, పులికళ్ళ రాజేశ్వరరావు ,కొల్లూరు బాలకృష్ణ చౌదరిలతో కలిసి మీడియో సమావేశంలో బీద రవిచంద్ర మాట్లాడారు.

మీడియాతో మాట్లాడిన ముఖ్య‌మైన పాయింట్స్‌

  • రాష్ట్రంలో అరాచక, అబద్దపు, దోపిడిపూరిత అవినీతి పాలన సాగుతోంది.
  • 2014 లో అధికారం చేపట్టేనాటికి ఉన్న 84 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ను 6నెలల్లోనే అధిగమించి మిగులు విద్యుత్ ను సాధించిన ఘనత నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిది.
  • టీడీపీ ప్రభుత్వ గడువు తీరే నాటికి రాష్ట్ర విద్యుత్ అవసరాల కంటే రెండున్నర శాతం అధిక విద్యుత్ ను సమకూర్చుకోగా , తదనంతరం అధికారం లోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ చేతకాని తనం తో విద్యుత్ కొరత ఏర్పడుతోంది.
  • టీడీపీ హయాంలో సోలార్ పవర్ కొనుగోలులో అవినీతి జరిగిందని నాడు గగ్గోలు పెట్టి, నేడు అధికారం లోకి వచ్చాక అదే సోలార్ విద్యుత్ ను రూ.25 రూపాయల చొప్పున వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది.
  • రెండున్నరేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలన లో రూ.13,611 కోట్ల విద్యుత్ భారాన్ని వివిధ కేటగిరి లు, పన్నుల పేరిట ప్రజలపై మోపారు.
  • టీడీపీ హయాంలో నిర్మించిన భవనాలకు, నిర్మాణాలకు తమ పార్టీ రంగులేసుకోవటం తప్ప రెండున్నరేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ది శూన్యం.
  • వెంకటగిరి రూరల్ లో ఎంజీ ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ కింద రూ. 65 లక్షలతో సిమెంట్ రోడ్లు నిర్మిస్తే విజలిన్స్ దర్యాప్తు పేరిట బిల్లులు చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం వేధిస్తోంది.
  • కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ మూర్ఖంగా వ్యహరిస్తోంది వైసీపీ ప్రభుత్వం.
  • టీడీపీ హయాంలో 62 సంక్షేమ పథకాలు అమలులో ఉండగా, వాటిని 9 పథకాలకు కుదించడమే కాక సంక్షేమ పథకాలలో దేశానికే తాము ఆదర్శమని వైసీపీ ప్రభుత్వ బీరాలు సిగ్గుచేటు.
  • నిత్యావసర ధరలను వైసీపీ ప్రభుత్వం అమాంతం పెంచి ప్రజలపై పెనుభారం మోపింది.
  • మద్యం అమ్మకాల ద్వారా వైసీపీ ప్రభుత్వం ఏడాదికి 10 వేల కోట్ల పైగా అదనపు ఆదాయం రాబడుతోంది.
  • సంపూర్ణ మద్యపాన నిషేధం వైసీపీ ప్రభుత్వం అమలు చేయకపోగా దేశంలో ఎక్కడా లేని నాసిరకం మద్యం బ్రాండ్లను తెచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది.
  • అబద్దాలతో ప్రజలను మోసం చేయటం వైసీపీ ప్రభుత్వం ఇకనైనా మానుకోవాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Sadha Meekosam Daily 14-10-2021 Issue

Spread the loveSadha Meekosam Daily 14-10-2021 Issue       Old Issues / More E Papers   Post Views: 646       

You May Like

error: Content is protected !!