జూలై 31న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం వర్చువల్ సేవా టికెట్లకు భక్తుల నుండి విశేష స్పందన సిరులతల్లి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 31న వరలక్ష్మీ వ్రతం ఏకాంతంగా జరుగనుంది. ఈ వరలక్ష్మీ వ్రతాన్ని భక్తుల కోరిక మేరకు వర్చువల్ విధానంలో నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. భక్తులు […]
Year: 2020
నెల్లూరులో లాక్‌డౌన్ అమలు.. నిబంధనలు ఇవే..
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని పలు నగరాలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించుకుంటున్నాయి. తాజాగా నేటి నుంచి నెల్లూరులో లాక్‌డౌన్ తరహా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. జూలై 31 వరకు ఈ నిబంధనలు అమలవుతాయని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు వెల్లడించారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసరాల దుకాణాలకు మాత్రమే […]
బొల్లినేని నర్సింగ్ కళాశాల కోవిడ్ క్వారెంటన్ సెంటర్ ను తనిఖీ చేసిన కలెక్టర్ చక్రధర్ బాబు
నెల్లూరు నగరంలోని ధనలక్ష్మిపురం లో ఉన్న బొల్లినేని నర్సింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ క్వారంటైన్ సెంటర్ ను గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు ఆకస్మికంగా సందర్శించి, క్వారంటైన్ సెంటర్ లో చికిత్స పొందుతున్న వారికి అందిస్తున్న వైద్య సేవలు, భోజన వసతులను పరిశీలించారు. క్వారంటైన్ సెంటర్ లో ఇప్పుడు ఉన్న బెడ్స్ సామర్ధ్యాన్ని రెండింతలు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. క్వారంటైన్ సెంటర్ […]
వైసీపీ అభివృద్ధిని అడ్డుకునేందుకు టిడిపి కోర్టులు చుట్టూ ప్రదక్షిణలు -ఎమ్మెల్యే కాకాణి
జగన్మోహన్ రెడ్డి మునుపు ఎన్నడూ లేని విధంగా నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పధకం కింద, ఇళ్ల స్థలాల పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగిందని,సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండల రెవిన్యూ కార్యాలయంలో “నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు” పథకంపై అధికారులతో సమీక్షించి, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 8వ తేది ఇళ్ల పట్టాలు […]
నెల్లూరులో మళ్లీ లాక్ డౌన్
నెల్లూరు లో మళ్లీ లాక్ డౌన్. రేపటినుండి జూలై 31 వరకు సంపూర్ణ లాక్ డౌన్ విదిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసారు. ఉదయం 6గం నుండి మధ్యాహ్నం 1గం వరకు నిత్యావసర సరుకులకు అనుమతి. ఇక ఇప్పటికే కావాలి, ఆత్మకూరు, నాయుడుపేట, గూడూరులో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. కరోనా కట్టడికి ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపడుతున్నారు.
వచ్చే రెండు నెలలు ఎంతో కీలకం-అప్రమత్తంగా ఉండాలని ప్రైవేటు ఆస్పత్రులకు సూచనలు చేసిన కలెక్టర్ చక్రధర్ బాబు
నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరం ప్రాంగణంలోని డి.ఈ.ఓ.సిలో.., గురువారం ఉదయం కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర్ రెడ్డితో కలిసి.., ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలు, జిల్లా వైద్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలి..? అన్ని ఆస్పత్రుల్లో మందులు, బెడ్స్ అందుబాటులో ఉన్నాయా..? అని ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలను అడిగారు. జిల్లాలో అన్ని ప్రైవేటు […]
అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తాం-లేఅవుట్ లను పరిశీలించిన కలెక్టర్ చక్రధర్ బాబు
నెల్లూరు జిల్లా విడవలూరులో గురువారం మద్యాహ్నం.., కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు పర్యటించారు. తొలుత ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్.., ఆర్డీఓ, ఎమ్మార్వోతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిచనున్న ఇళ్ల పట్టాల పంపిణీపై సమీక్షించారు. అనంతరం విడదవోలు పేదలు ఇవ్వడానికి సిద్ధం చేసిన.., ఇళ్ల ప్లాట్ల లే అవుట్ ని కలెక్టర్ పరిశీలించారు. లే అవుట్ లో ఎంతమంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు..? అర్హులందరికీ పట్టాలు […]
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ కాలేజీల్లో ఐఐటీ, జేఈఈలకు శిక్షణ..
పాఠశాల విద్య, గోరుముద్ద కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ విద్య అమలు చేయాలన్న ఆయన.. స్కూళ్లలో 8వ తరగతి నుంచే కంప్యూటర్ విద్యను అందించాలన్నారు. అటు విద్యార్ధుల్లో ఇంగ్లీష్ పరిజ్ఞానంపై టోఫెల్ తరహ పరీక్షలను నిర్వహించాలని సీఎం జగన్ సూచించారు. ప్రతీ జిల్లాకు టీచర్ల కోసం ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో […]
వార్నింగ్‌లు ఇస్తే ఏంటి.? నా ధైర్యం వాళ్లకు తెలియదు.!
రామ్ గోపాల్ వర్మ.. ఒకప్పుడు సంచలనాలకు కేరాఫ్ అయిన ఈ దర్శకుడు.. ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాడు. ఆయన తీసే సినిమాలే విమర్శలను తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఆర్జీవీ ‘పవర్ స్టార్’ అనే టైటిల్‌తో సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తమ అభిమాన హీరోను టార్గెట్ చేసి సినిమాను తెరకెక్కించారంటూ పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వర్మ […]
ఆయనోఎంపీ.. ఆయనకు ఎవ్వరికీ చెప్పుకోలేని కష్టం..!
బల్లి దుర్గా ప్రసాద్. తిరుపతి ఎంపీ.. గతంలో నెల్లూరు జిల్లా గూడురు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. చిన్న వయస్సులోనే అసెంబ్లీలోకి అడుగుపెట్టి శాసనసభ్యుడిగా నాలుగుసార్లు గెలిచారు. సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్న ఆయన తర్వాత వైసీపీలో చేరి.. ఇప్పుడు తిరుపతి ఎంపీగా ఉన్నారు. వైసీపీ కేడర్ కానీ.. అధికారులు కానీ ఓ ఎంపీగా తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని దుర్గాప్రసాద్ ఆవేదన చెందుతున్నారట. ఇదే సమయంలో మా ఎంపీ ఎక్కడ […]

