చిన్నారుల మధ్య మేయర్ జన్మదిన వేడుకలు
చిన్నారుల మధ్య మేయర్ జన్మదిన వేడుకలు
నెల్లూరు కార్పొరేషన్, ఆగస్టు 5 (సదా మీకోసం) :
నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ స్రవంతిజయవర్ధన్ జన్మదినం సందర్భంగా శుక్రవారం నాడు స్థానిక రెవెన్యూ కాలనీ లోని విశ్వభారతి అంధుల పాఠశాలలో అక్కడి పిల్లలతో కలిసి జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు.
చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి వారికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు విశ్వ భారతి అంధుల పాఠశాలలో నా జన్మదినం పిల్లలతో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
ఆదరణ కోసం ఎదురు చూసే ఇలాంటి చిన్నారుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలను నగర పౌరులు జరుపుకుంటే మధురానుభూతిగా మిగులుతుందని మేయర్ పేర్కొన్నారు. వీలున్నంతలో నిరాశ్రయులను ఆదుకుని ప్రతిఒక్కరు మానవత్వం చాటుకోవాలని మేయర్ ఆకాంక్షించారు.