రామ రాజ్య స్థాపనే ధ్యేయం గా రామమందిర నిర్మాణం చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ : యశ్వంత్ సింగ్
రామ రాజ్య స్థాపనే ధ్యేయం గా రామమందిర నిర్మాణం చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ : యశ్వంత్ సింగ్
-: నెల్లూరు నగరం, ఆగస్టు 5 (సదా మీకోసం) :-
రామ రాజ్య స్థాపనే ధ్యేయంగా రామమందిర నిర్మాణం చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ చరిత్రలో నిలిచిపోతారని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకులు యశ్వంత్ సింగ్ వ్యాఖ్యానించారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం సుదీర్ఘ పోరాటం చేసిన భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా మేనిఫెస్టోలో సైతం చేర్చి ఆ మేరకు కార్యాచరణకు పూనుకోవడం హర్షించదగిన విషయమని యశ్వంత్ సింగ్ తెలిపారు.
నేటి ఉదయం రామమందిర నిర్మాణ కార్యక్రమంలో ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక రామ మందిరం లో పూజలు నిర్వహించి సకాలంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా రామమందిర నిర్మాణం పూర్తి కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో ఆయన ప్రజల ఆశయం నెరవేరాలని భగవంతుని ప్రార్ధించి 108 టెంకాయలు కొట్టి స్వామివారి మొక్కుకున్నారు.
ఎన్ని యుగాలు మారినా రాముని చరిత౦ నిత్య నూతన మేనని యశ్వంత్ సింగ్ అన్నారు.
రామ రాజ్య స్థాపన లో భాగమే రామమందిర నిర్మాణంమనీ, ఈ ఆలయ సాధన కోసం ఎంతో మంది నాయకులు పోరాడారని వారందరికీ శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఉండాలని యశ్వంత్ శ్రీరాముని ప్రార్ధించారు.
కార్యక్రమంలో వింజమూరు జడ్పిటిసి అభ్యర్థి రాజశేఖర్ , మహేష్ మోకీ , వెంకటేష్ , రాజేష్, సునీల్ ,సుభాష్ తదితరులు పాల్గొన్నారు.