ప్రకృతి వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించాలి

Udatha Ramakrishna
Spread the love

ప్రకృతి వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించాలి

జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా

కొత్తపట్నం, ఏప్రిల్ 30 (సదా మీకోసం) :

కొత్తపట్నం మండలంలో ప్రకృతి వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

బుధవారం కొత్తపట్నం మండలంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విస్తృతంగా పర్యటించారు.

తొలుత జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా, కొత్తపట్నం మండలం రంగాయపాలెంలోని శ్రీ కృష్ణం వెంకటరావు డెయిరీ ఫారంను సందర్శించి, పాడి రైతులకు సబ్సిడీతో మేత విత్తనాలను, దాణా పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా డెయిరీ ఫారం ఏర్పాటుకు ఎంత ఖర్చయింది, డెయిరీ నిర్వహణకు నెలకు ఎంత ఖర్చవుతుంది, ఆదాయం ఎంత వస్తుంది తదితర విషయాలను జిల్లా కలెక్టర్, డెయిరీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

ఈ డెయిరీ ఫాం ఏర్పాటుకు 25 లక్షల రూపాయలు రుణం తీసుకోవడం జరిగిందని, డెయిరీ ఫాం లో 32 ఆవులు ఉన్నాయని, వీటి వలన సుమారు రోజుకు 400 నుండి 500 లీటర్ల వరకు పాలు వస్తున్నదని డెయిరీ ఫాం నిర్వాహకులు చెప్పడం జరిగింది. నెలకు కూలీలు, నిర్వహణకు, దాణా కు, ఈఎంఐ తదితర ఖర్చులు పోను నెలకు సుమారు లక్ష రూపాయల నుండి ఒకటిన్నర లక్ష ఆదాయం వస్తుందని డెయిరీ నిర్వహకులు వివరించడం జరిగింది.

గతంలో లీటరుకు 40 రూపాయలు వచ్చేదని, నేడు 37 రూపాయలు మాత్రమే తున్నదని, 40 రూపాయలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది.

అనంతరం జిల్లా కలెక్టర్, కొత్తపట్నం డిడికాలనీలో రైతు పి. వెంకటేశ్వర్లు సంబంధించి ప్రకృతి వ్యవసాయంతో సాగుచేస్తున్న వేరుశనగ పొలాన్ని సందర్శించి రైతుతో మాట్లాడటం జరిగింది.

ప్రస్తుతం వేరుశనగ పంట తో పాటు అంతర పంటలుగా పొద్దుతిరుగుడు, బెండకాయ, క్లస్టర్ బీన్ సాగుచేయడం జరుగుచున్నదని, గతంలో ఎకరాకు సుమారు 55 వేల రూపాయలు ఖర్చు అయ్యేదని, ఖర్చులు పోను ఆదాయం ఎకరాకు సుమారు 15 వేల రూపాయలు వచ్చేదని, నేడు ప్రకృతి వ్యవసాయంతో పాటు అంతర పంటల సాగు వలన ఖర్చు ఎకరాకు 40 వేల రూపాయలు మాత్రమే ఖర్చు అగుచున్నదని, ఖర్చులు పోను సుమారు 25 వేల రూపాయల దాకా ఆదాయం వస్తున్నదని ఈ సందర్భంగా రైతు జిల్లా కలెక్టర్ కు వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ కొత్తపట్నం మండలం, గమళ్ళపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో భాగంగా పిఎండిఎస్ విధానంలో సాగు చేస్తున్న రైతు పి.వెంకటేశ్వర రెడ్డి కి సంబంధించిన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు బంజరు భూమిలో పిహెచ్., తేమ మరియు ఉష్ణోగ్రత నమోదుపై లైవ్ డెమో, అలాగే పిఎండిఎస్ క్షేత్రంలో మట్టి నమూనా సేకరణపై నిర్వహించిన డెమోను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పిఎండిఎస్ విధానం వలన సాయిల్ హెల్త్, క్రాప్ హెల్త్ బాగా వృద్ది చెందుతుందని వ్యవసాయ శాఖ అధికారులు కలెక్టర్ కు వివరించారు.

అనంతరం జిల్లా కలెక్టర్, కొత్తపట్నం లోని హార్టీకల్చర్ క్షేత్రాన్ని సందర్శించి, పలు రకాల హార్టీకల్చర్ మొక్కల పెంపకం విధానాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పిఎండిఎస్ కిట్‌ల తయారీ మరియు పంపిణీపై అలాగే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ తిలకించి సంబంధిత అధికారులు, రైతుల వద్ద నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్, రైతులకు జీలుగా, జనుము, పిల్లిపిసర విత్తనాలను సబ్సిడీతో అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హార్టికల్చర్ ఫాం లో మొక్కను నాటారు.

కార్యక్రమాల్లో ఒంగోలు ఆర్ డి ఓ లక్ష్మి ప్రసన్న, పశు సంవర్ధక శాఖ జెడి డా. బేబి రాణి, వ్యవసాయ శాఖ ఇంచార్జి జెడి సుబ్రహ్మణ్యేశ్వర శర్మ, ప్రకృతి వ్యవసాయ డి పి ఎం సుభాషిణి, ఎపిఎంఐపి పిడి రమణ, జిల్లా హార్టీకల్చర్ అధికారి గోపి చంద్, తహసిల్దార్ శ్రీ మధుసూధన రావు, ఎంపిడిఓ శ్రీకృష్ణ, మండల వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలి

Spread the loveమౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఒంగోలు వైద్యం, ఏప్రిల్ 30 (సదా మీకోసం) : జిల్లా లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, వైద్యాదికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ తమీమ్ […]

You May Like

You cannot copy content of this page