బద్వేల్ – గురువిందపూడి హైవే అభివృద్ధిపై కేంద్ర కేబినెట్ నిర్ణయంపై ఎంపీ హర్షం

Udatha Ramakrishna
Spread the love

బద్వేల్ – గురువిందపూడి హైవే అభివృద్ధిపై కేంద్ర కేబినెట్ నిర్ణయంపై ఎంపీ హర్షం

 

నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయడంపై కేబినెట్ నిర్ణయాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించిన ప్రధాని నరేంద్ర మోడీ

 

ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేసిన ఎంపీ వేమిరెడ్డి

 

ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రం చూపుతున్న శ్రద్ధ కు ధన్యవాదాలు : ఎంపీ వేమిరెడ్డి

 

నెల్లూరు ప్రతినిధి, మే 29 (సదా మీకోసం) :

 

బద్వేలు – నెల్లూరు రహదారిలో బద్వేల్ – గోపవరం (ఎన్.హెచ్.-67) నుంచి గురువిందపూడి (ఎన్.హెచ్.- 16) వరకు 4 లేన్ల హైవే నిర్మాణానికి ₹3653 కోట్లతో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కేబినెట్ నిర్ణయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా మారనుందని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర యువతకు అనేక అవకాశాలు దక్కుతాయని చెప్పారు. దీనిపై స్పందించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు చేస్తున్న కృషికి ఇది నిదర్శనమన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రహదారి అభివృద్ధి వల్ల ప్రాంతీయ అనుసంధానంతో పాటు ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందన్నారు. అలాగే యువతకు అనేక అవకాశాలు దక్కుతాయని పేర్కొన్నారు. ఈ హైవే కారిడార్ ఎన్.హెచ్.-67 (బద్వేల్) నుండి ఎన్.హెచ్.-16 (గురువిందపూడి) వరకు 108 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. కృష్ణపట్నం పోర్ట్‌కు ప్రయాణ దూరాన్ని సగానికి తగ్గించే ఈ మార్గం.. రాష్ట్రం లోని 3 ప్రధాన పారిశ్రామిక కారిడార్లను కలుపుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Sadha Meekosam Daily SPSR Nellore, Tirupati, Prakasam 30-05-2025 E-Paper Issues

Spread the loveSadha Meekosam Daily SPSR Nellore, Tirupati, Prakasam 30-05-2025 E-Paper Issues   SPSR Nellore         Prakasam         Tirupati             విలేకరులు కావలెను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల నుండి ప్రచురితం అవుతున్న సదా మీకోసం దిన పత్రికలో పని చేయుటకు […]

You May Like

You cannot copy content of this page