సంగం బ్యారేజీ నిర్మాణ పనులను మంత్రి తో కలిసి పరిశీలించిన ఎస్పీ
సంగం బ్యారేజీ నిర్మాణ పనులను మంత్రి తో కలిసి పరిశీలించిన ఎస్పీ
నెల్లూరు క్రైం, ఆగస్టు 27 (సదా మీకోసం) :
సంగం బ్యారేజీ నిర్మాణ పనులను మంత్రి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా ఎస్పీ విజయరావు పరిశీలించారు.
మంత్రులు అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ లతో కలిసి పర్యటించారు
జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అంబటి రాంబాబుని శనివారం ఉదయం నెల్లూరు ఆర్ అండ్ బి అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి ఎస్పీ పుష్పగుచ్ఛాలు అందజేశారు.
సంగం బ్యారేజీ వద్ద హెలిపాడ్, సంగం సమీపంలో బహిరంగ సభ, పెన్నా బ్యారేజి పరిధిలో చక్కర కర్మాగారం వద్ద ఏర్పాటు చేయనున్న హెలిపాడ్ ను, తదితర ప్రాంతాలలో పర్యటించి భద్రతా ఏర్పాట్లు పరిశీలిన చేసి అధికారులకు తగిన సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి పర్యటనకు తగిన ప్రణాళికలతో పోలీసు శాఖ సమాయత్తం అవుతుంది.
అన్ని విభాగాల ఇంచార్జ్ లను సంప్రదించి సమన్వయం చేసుకోవాలని ఎస్పీ విజయరావు ఆదేశాలు జారీచేశారు.