జగన్ పాలనలో దుర్భరంగా కార్మికుల పరిస్థితి
జగన్ పాలనలో దుర్భరంగా కార్మికుల పరిస్థితి
తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్
-: నెల్లూరు మార్చి 20 (సదా మీకోసం) :-
గత మూడేళ్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో కార్మికులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (టీఎన్ టీయూసీ) గంటుపల్లి శేషగిరిరావు విమర్శలు గుప్పించారు.
నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో వివిధ రంగాల నమ్ముకొని పనిచేస్తున్న కార్మికులు నేడు మూడు పూటలా తినడమే గగనమై పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఇసుక ధరలు ఆకాశాన్నంటాయని భవన నిర్మాణ రంగం కుప్పకూలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ రంగాన్ని నమ్ముకొని పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు నేడు జీవనోపాధి కూడా దొరకడం కష్టం అయిందన్నారు.
గత మూడు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగు లక్షల అప్పులు తీసుకువచ్చారని ఇంకెన్ని లక్షలు అప్పులు తీసుకు వస్తారని ఆయన ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పాలన దనార్జన పాలనగా మారిపోయింది. రాష్ట్రంలోని కార్మికులను మరియు కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వలేక ఇబ్బందులకు గురిచేస్తూ నానా ఇబ్బందులు పెడుతున్నారన్నారు.
అదే విధంగా కార్మిక సంక్షే నిధికి సెస్సుల రూపంలో వసూలైన రూ.1400 కోట్ల రూపాయలను స్వంత పథకాలకు ఉపయోగించుకొని కార్మికుల కడుపు కొడుతూ అదే విధంగా కార్మికులు మరణించి, అంగవైకల్యం పొందిన వారికి ఇవ్వవలసిన మొత్తాలను గత 2 సంవత్సరాల నుండి ఆపివేశారన్నారు.
అదే విధంగా ఇసుకను సకాలంలో సరసమైన ధరలకు అందక భవన నిర్మాణ కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు.
జెన్ కో ఆధ్వర్యంలో నడుస్తున్న 21వేల కోట్ల రూపాయలు విలువైన దామోదర సంజీవయ్య ధర్మల్ విధ్యుత్ కేంద్రాని లీజు పేరుతో తక్కువ ధరకు అమ్మజూపడం జగన్ మొండివైఖరికి పరాకాష్ట అన్న క్యాంటిన్లలో కేవలం రూ. 5/-లకు పేదలకు కడుపు నిండేదని ఈ రోజు పథకం లేనందువల్ల రోజు కూలీలు కూడా లేని భవన నిర్మాణ కూలీల కడుపులు నిండక పస్తులుండవలసిన పరిస్థితి నెలకొందని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గతంలో నినదించి తెచ్చుకున్న విశాఖ ఉక్కును అమ్మివేయడానికి పార్లమెంటులో మద్దతిచ్చి అక్కడి కార్మికులకు ఉపాధి భద్రత లేకుండా చేసారని టి.ఎన్.టి.యు.సి. రాష్ట్ర గౌరవాధ్యక్షులు గుంటుపల్లి శేషగిరి రావు జగన్ పాలనపై మండి పడ్డారు.
సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కండ్ర లక్ష్మిపతి నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ, మదమంచి శ్రీనివాస్, అధికార ప్రతినిధి వేముల సుబ్బారావు, నెల్లూరు నగర అధ్యక్షులు గుమ్మడిపూడి కళ్యాణ్ కుమార్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి దేవరాల ప్రసాద్ ముదిరాజ్, జెన్ కో ప్రెసిడెంటు రవి, వైస్ ప్రెసిడెంటు, మోహన్ రావు, పార్లమెంటు ఆర్గనైజింగ్ సెక్రటరీ సర్వేపల్లి హరిత మిగతా జిల్లా కార్యవర్గం పాల్గొన్నారు.