అజీజ్ ను ఎమ్మెల్యే చేసే వరకు రూరల్ లో గడప గడప కు తిరుగుతా
అజీజ్ ను ఎమ్మెల్యే చేసే వరకు రూరల్ లో గడప గడప కు తిరుగుతా
అజీజ్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తా
మాజీ మంత్రి రమేష్ రెడ్డి
శుక్రవారం నెల్లూరు నగరంలోని 32 వ డివిజన్ లోని ఇందిరా నగర్ లో డివిజన్ నాయకులతో జిల్లా టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు…
ముందుగా ఇందిరా నగర్ లోని అమ్మవారి గుడి లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం సమావేశం నిర్వహించారు…
సమావేశంలో మాజీ మంత్రి వర్యులు తాళ్ళపాక రమేష్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్ళపాక అనురాధ నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు…
ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని రూరల్ లో తిరిగి అబ్దుల్ అజీజ్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని తెలిపారు….
సౌమ్యుడు, మంచి మనిషి, అయిన అబ్దుల్ అజీజ్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నందమూరి అభిమాని పైన, టీడీపీ నాయకుల పైన, కార్యకర్తల పైన ఉందని తెలిపారు….
కేవలం టీడీపీ హయాంలో నెల్లూరు నగరం అభివృద్ధి పథం లో నడిచిందనీ, నేను మంత్రి గా ఉన్నపుడు అబ్దుల్ అజీజ్ మేయర్ గా ఉన్నపుడు ఎన్నో వేల కోట్లతో అభివృద్ధి పరిచామని తెలిపారు…
రాబోయే ఎన్నికల్లో అబ్దుల్ అజీజ్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే నెల్లూరు రూరల్ ను అభివృధ్ది పథంలో నడుపుతారనీ, రూరల్ ను అభివృద్ధి కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మరుస్తారని తెలిపారు….
అబ్దుల్ అజీజ్ ను ఎమ్మెల్యే గా గెలిపించే వరకు రూరల్ లో గడప గడప కు తిరుగుతానని తెలిపారు…
ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ
ఓట్ల కోసం మీ దగ్గరకు వచ్చి సమావేశాలు పెట్టలేదని, మి సమస్యలు తెలుసుకోవడానికి, వాటిని తీర్చే ప్రయత్నం చేయడానికి సమావేశం పెట్టామని తెలిపారు…
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలనీ, రాష్ట్ర ప్రజలను జగన్ రెడ్డి చెర నుండి విడుదల చేయాలని తెలిపారు….
ఓటు వేసేటప్పుడు కల్పించాల్సి ఉంది నాయకుడు కాదని ఓటు వేసేటప్పుడు మన బిడ్డల భవిష్యత్తు కనపడాలని అన్నారు….
పై కార్యక్రమంలో నెల్లూరు శ్రీనివాసులు నాయుడు, జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, గంగాధర్, మల్లిక, సెళ్వి, మాతంగి కృష్ణా, రేవతి, ఆనంద్, శ్రీనాథ్,ఆస్లామ్, కేశవ, సంతోష్, తదితరులు పాల్గొన్నారు