స్వాతంత్ర సమరయోధులకు ఘన నివాళులు
స్వాతంత్ర సమరయోధులకు ఘన నివాళులు
-: కోట, ఆగస్టు 8 (సదా మీకోసం) :-
భారత స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారిపై భారతీయులు చేసిన పోరాటంలో అత్యంత కీలక ఘట్టమైన “డు ఆర్ డై” అనే నినాదంతో చేపట్టిన క్విట్ ఇండియా అనే సంఘటన లో బ్రిటిష్ వారిపై అహింసా పోరాటానికి సిద్దమైన మహాత్మా గాంధీజీ ఆయన కు సహకరించిన స్వాతంత్ర సమరయోధులకు శనివారం స్థానిక ఎం వి రావు పౌండేషన్ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించారు.
కోట మండలం విద్యానగర్ లోని ఎం వి వి రావు పౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి క్విట్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులకు జ్యోతి ప్రజ్వలన చేసి కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు.
1942 వ సంవత్సరం ఆగస్టు ఎనిమిదో తేదీ భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా సంగ్రామానికి ఆమోద ముద్ర వేసింది.
ఈ క్విట్ ఇండియా కు అహింసా నినాదంతో స్వాతంత్ర పోరాటం చేసిన మహాత్ముడు అహింస వాది బాపూజీ “డు ఆర్ డై” అనే నినాదం భారత దేశ ప్రజల లో లో స్వాతంత్ర ఆకాంక్షను పెంచింది.
1857 సంవత్సరంలో జరిగిన స్వాతంత్ర సంగ్రామం తరువాత బాపూజీ నేతృత్వంలో 1942 లో ఈ క్విట్ ఇండియా కార్యక్రమానికి ఆనాటి కన్నా లక్షలాదిమంది స్వాతంత్ర సమరయోధులు నేతృత్వంలో జరిగిన ఈ సంఘటన చారిత్రాత్మక సంఘటనని పలువురు నేటికి అభివర్ణిస్తుంటారు మరియు భారతదేశ చరిత్ర పుటల్లో లిఖించబడింది.
ఈ ఉద్యమం అనంతరమే మనకు స్వాతంత్రం సిద్ధించింది ఆ క్రమంలో శనివారం క్విట్ ఇండియా స్వరాజ్య వరంగా మేధావులు ఈ కార్యక్రమాన్ని అభివర్ణిస్తుంటారు అని ఎం వి రావు చైర్మన్ ముప్పవరపు లీల మోహన కృష్ణ తెలిపారు.
అదేవిధంగా భిన్నత్వంలో ఏకత్వం లో భాగంగా మన భారతదేశంలో మతాలు వేరైనా, కులాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, భాషలు ఎన్ని ఉన్నా, మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గా ప్రపంచ దేశాలలో కలికితురాయిగా మారిందని, అందుకే మన భారతదేశంలో హిందూ, క్రిస్టియన్, ముస్లిం, భాయ్ భాయ్, సోదర భావంతో భిన్నత్వంలో ఏకత్వం ను భారతీయత గా, మన దేశం మనకు గర్వకారణం గా నిలుస్తుందని పౌండేషన్ చైర్మన్ లీలా మోహన్ కృష్ణ అన్నారు
ఈ కార్యక్రమంలో పౌండేషన్ నిర్వాహకులు ఎం ఆదిలక్ష్మి , ఎం విజయలక్ష్మి విద్యానగర్ గ్రామ ప్రజలు పలువురు పాల్గొన్నారు.