హిందూపురం జిల్లా సాధన కోసం నేడు ర్యాలీ… హాజరుకానున్న శాసనసభ్యులు బాలకృష్ణ
హిందూపురం జిల్లా సాధన కోసం నేడు ర్యాలీ
హాజరుకానున్న శాసనసభ్యులు బాలకృష్ణ
హిందూపురం ఫిబ్రవరి 3 (సదా మీకోసం) :
శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గురువారం సాయంత్రం హిందూపురం చేరుకున్నారు. ఆయన నివాసంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తో ముచ్చటించారు.
శుక్రవారం హిందూపురం జిల్లా సాధన కోసం పొట్టశ్రీరాములు సర్కిల్ చిన్నమార్కెట్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు పాదయాత్రగా జరుగు ర్యాలీ విచ్చేసి అంబేద్కర్ విగ్రహంకు పులమాలలు వేసి నివాళులర్పించి మౌనదీక్ష చేసి ప్రజలనుద్దేశించి ప్రసంగించడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొనే వారు కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి పాల్గొనాలని తెలిపారు.
అలాగే అదేరోజు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు అఖిలపక్షం సమావేశం సాయిరాం ఫంక్షన్ హాల్ నందు పాల్గొంటారని తెలిపారు.