పవనన్న ప్రభుత్వంలో స్వయం ఉపాధి ఋణాలిస్తాం : కేతంరెడ్డి వినోద్ రెడ్డి
పవనన్న ప్రభుత్వంలో స్వయం ఉపాధి ఋణాలిస్తాం
-పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నిర్విరామంగా 83వ రోజున 51వ డివిజన్ స్థానిక సుబేదారుపేటలోని మేదర వీధిలో జరిగింది.
ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను విని అండగా ఉంటూ పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి ( Kethamreddy Vinod Reddy ) మాట్లాడుతూ సుబేదారుపేట మేదర వీధిలో కులవృత్తిని నమ్ముకుని స్వయం ఉపాధి పొందుతున్న కుటుంబాలు అనేకం ఉన్నాయన్నారు.
బుట్టల అల్లికలు, పుల్లల చీపురు తయారీ, సన్న కర్రలు వంటి ఉత్పత్తులను తయారు చేస్తూ రోజువారీ సంపాదనపై ఆధార పడే పేద, మధ్య తరగతి కుటుంబాలకు అండగా నిలవాల్సిన వైసీపీ ప్రభుత్వం వీరిని విస్మరించిందని అన్నారు.
బీసీ కార్పొరేషన్ నిధులతో ఋణాలు ఇవ్వకుండా ఉచితాలకు మళ్ళించి శ్రమ చేసి బ్రతికే ఇలాంటి వారికి వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని తెలిపారు.
ప్రజలందరూ పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదిస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ Pavan Kalyan అని, పవనన్న ప్రభుత్వంలో ఇలా స్వయం ఉపాధి పొందే వారికి 1 లక్ష నుండి 10 లక్షల రూపాయల వరకు ఋణాలిస్తామని, అదేవిధంగా ప్రతిభ కలిగి పది మందికి ఉపాధి చూపగల యువతకు పెట్టుబడి సాయం క్రింద తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలో ఏటా లక్ష మందికి తలా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.