కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కి కీలక బాధ్యతలు
కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కి కీలక బాధ్యతలు
వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా నియామకం
నెల్లూరు రూరల్ లో కీలకంగా పనిచేస్తున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
అమరావతి, మార్చి 17 (సదా మీకోసం) :
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. గత మూడు సంవత్సరాలుగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జిగా కీలకంగా పనిచేస్తున్నారు.
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల సమయంలో అనేక డివిజన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు తీవ్రంగా శ్రమించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి చేదోడువాదోడుగా ఉంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నెల్లూరు రూరల్ లో అత్యంత బలోపేతం చేయడంలో గిరిధర్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. నెల్లూరు రూరల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు.
కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాష్ట్ర నాయకత్వం లోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. దీంతో నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో కార్యకర్తలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు.