ఎంతో ఘన చరిత్ర కలిగిన చేనేత రంగం నేడు సంక్షోభం లో ఉంది : చేజర్ల
ఎంతో ఘన చరిత్ర కలిగిన చేనేత రంగం నేడు సంక్షోభం లో ఉంది : చేజర్ల
- జి ఎస్ టి, కరోనా కారణంగా చేనేత రంగం కుదేలు అయ్యింది.కావున చేనేత దినోత్సవ సందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగాన్ని ఉదారంగా ఆదుకోవాలి
- ఎన్నికలు ముందు చేనేత కార్మికులు అందరికీ నేతన్న నేస్తం ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి,అధికారం లోకి వచ్చిన తరువాత కేవలం మగ్గ మున్నవారికే ఇస్తున్నారు
- కుంటి సాకులు చూపి ప్రతి సంవత్సరం లబ్ధి దారులు సంఖ్య తగ్గిస్తున్నారు
- చేనేత రంగం సంక్షోభంలో ఉన్న ఈ సమయంలో మగ్గం ఉండే వారికే కాకుండా చేనేత కార్మికుల అందరికీ నేతన్న నేస్తం వర్తింప చేయాలి
- తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి
కోవూరు, ఆగష్టు 7 (సదా మీకోసం) :
కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత కార్మికులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఎంతో ఘన చరిత్ర కలిగిన చేనేత రంగం నేడు సంక్షోభం లో ఉంది.పెరిగిన ముడి సరుకుల ధరలు, జి ఎస్ టి,కరోనా కారణంగా చేనేత రంగం ఎన్నడూ లేని విధంగా నేడు పూర్తిగా కుదేలు అయ్యిందని విమర్శించారు.
చేనేత కార్మికులు ఎప్పటి నుండో చేస్తున్న వృత్తిని గిట్టుబాటు కాని కారణంగా వదలలేక, మరో పని చేయలేక సతమతమౌతున్నారన్నారు.
గతంలో తెలుగదేశం ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికుల కోసం అమలవుతున్న పథకాలను వైసీపీ ప్రభుత్వం నిలిపి వేసిందని తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు తను అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం లోని చేనేత కార్మికులు అందరికీ నేతన్న నేస్తం క్రింద ప్రతిఒక్కరికీ సంత్సరానికి రు.24 వేలు ఇస్తానని చెప్పి, అధికారం లోకి వచ్చిన తరువాత కేవలం సొంత మగ్గం ఉన్న వారికే ఇస్తున్నారు అన్నారు.
రాష్ట్రంలో మగ్గం ఉండే వారి కంటే అనుబంధ కార్మికులు అధికంగా ఉన్నారు. మగ్గం ఉండే వారికే ఇస్తూ అనుబంధ కార్మికులకు ఇవ్వక పోవడంతో చేనేత వృత్తిలో ఉన్న అనుబంధ కార్మికులు అందరూ నష్టపోతున్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేనేతలకు ఏ పథకం పెట్టిన మగ్గం ఉన్న వారితో పాటు చేనేత వృత్తిలో ఉన్న అందరికీ ఇచ్చిందిని వివరించారు.
నేతన్న నేస్తం పథకం లబ్ధి దారులు సంఖ్యను కూడా ప్రభుత్వం ప్రతి సంవత్సరం తగ్గించు కుంటూ పోతుంది.కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని,వాహనం లేక పోయిన ఉన్నట్లు చూపించు,పొలం లేక పోయిన ఉన్నట్లు చూపించి నేతన్న నేస్తం పథకాన్ని నిలిపివేస్తున్నారని తెలిపారు.
అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేనేత కార్మికులకు అమలవుతున్న అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపి వేసింది.ఆ పథకాలు అన్నింటినీ తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా అయినా సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు.
జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పిన మాటకు కట్టుబడి నేతన్న నేస్తం పథకాన్ని చేనేత కార్మికులు అందరికీ వర్తింప చేయాలని తెలుగదేశం పార్టీ తరుపున డిమాండ్ చేశారు.
సమావేశం లో తెలుగుదేశం పార్టీ నాయకులు జాన్నదుల రవి కుమార్,సోమా గోపాల్,ఉక్కుం మల్లిఖార్జున,సపరం వెంకటేశ్వర్లు, చల్లా శ్రీనివాసులు, ఇందుపురు మురళీృష్ణ రెడ్డి,భుధవరపు శివకుమార్,వల్లేపు సురేష్, నాగ వర్మాచారి,ఎస్ డి హుమాయూన్ తదితరులు పాల్గొన్నారు.