ముఖ్యమంత్రికి ప్రజా ఆరోగ్య వేదిక లేఖ

ముఖ్యమంత్రికి ప్రజా ఆరోగ్య వేదిక లేఖ
సీజనల్ వ్యాధులపై ప్రభుత్వం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోండి
విశాఖపట్నం, జూలై 25 (సదా మీకోసం) :
సీజనల్ వ్యాధులపై ప్రభుత్వం తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డా. యం.వి. రమణయ్య, ప్రధాన కార్యదర్శి టి. కామేశ్వరరావులు లేఖ రూపంలో ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు.
ఆ లేఖలో వర్షాకాలపు వ్యాధుల నివారణకు అన్ని జిల్లాలలో తక్షణ చర్యలు తీసుకోవడం గురించి వివరించారు.
ప్రస్తుతం వర్షాలు, వరదల వలన రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ విషజ్వరాలు విపరీతంగా పెరుగుతున్నాయని, కావున రాష్ట్ర ప్రభుత్వం మరియు కార్పొరేషన్ లు ఈ క్రింది నివారణా చర్యలు వెంటనే తీసుకోవలసిందిగా ప్రజారోగ్య వేదిక కోరింది.
ఈ సందర్భంగా క్రింది జాగ్రత్తల పాటించాలని అధ్యక్షులు డా. యం.వి. రమణయ్య కోరారు.
1. మురుగు కాల్వలలో నీరు నిలవకుండా పేరుకుంటున్న చెత్తను క్లీన్ చేసే విధంగా అన్ని నగర కార్పొరేషన్, పురపాలక, గ్రామపంచాయితీలు వెంటనే చర్యలు తీసుకోవాలని,
2. ప్రస్తుతం అన్ని జిల్లాలలో వర్షాల కారణంగా వ్యాధులు ప్రబలి రోగుల సంఖ్య విపరీతంగా పెరిగి ప్రభుత్వ మరియు ప్రయివేటు ఆసుపత్రులు కిక్కిరిసి పోతున్న పరిస్థితి ఉంది. కావున ప్రభుత్వ ఆసుపత్రులలో మౌళిక సదుపాయాలతో పాటు వైద్యులు, వైద్యేతర సిబ్బంది మరియు మందుల కొరత లేకుండా చూడాలి.
3. వరద ముంపు వల్ల వేలాది మంది
ప్రజలు వరద ప్రాంతంలో ఉన్నారు. వారికి రక్షిత మంచినీరు,ఆహారం అందించడంతో పాటు తక్షణం అన్ని చోట్ల మెడికల్ క్యాంపులు నిర్వహించాలి.
4. నివాస ప్రాంతాల సమీపంలో నీరు నిలువ ఉన్న చోట ఆయిల్ బాల్స్, అటేట్ స్ప్రే వంటివి పిచికారి చేయించి,గంబూషియా చేపలను వదిలి దోమల గుడ్లను నిర్మూలించాలి.
5. ప్రణాళికాబద్ధంగా అన్ని ప్రాంతాలలో
ఫాగింగ్ నిర్వహించాలి. క్రిమిసంహారక మందులను స్ప్రే చేయించాలి. ఇళ్ళలో చెత్తకుండీలను ఎప్పటికప్పుడు ఖాళీ చేయించాలి.
6. “డ్రై డే” పై ప్రజలకు మరింత అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలి.
7. త్రాగునీరు కలుషితం కాకుండా మరియు పరిశుభ్రమైన నుంచి నీరు ప్రజలందరికీ అందించేందుకు కార్పోరేషన్,మునిసిపల్ పట్టణ, గ్రామ పంచాయతీలు తగు చర్యలు చేపట్టాలి..
8. దోమల నిర్మూలన కార్యక్రమంలో ప్రజలను, ప్రజా సంఘాలను, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చెయ్యాలి.
9.ఏజన్సీ జిల్లాలలో ప్రత్యేక శ్రదద్ధ పెట్టి గ్రామాలలో రహదారులు, వైద్యశాలలు, వైద్య సిబ్బందిని తక్షణమే ఏర్పాటుచేసి, మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలకుండా అరికట్టే చర్యలు తీసుకోవాలి.
10. రక్త నిధులలో సరిపోయినంత ప్లేట్లెట్స్ అందుబాటులో ఉండే విధంగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలి.