గోమాత సేవలో తరించిన కార్పొరేటర్ జానా నాగరాజు
గోమాత సేవలో తరించిన కార్పొరేటర్ జానా నాగరాజు
నెల్లూరు రూరల్., జనవరి 16 (సదా మీకోసం)
కనుమపండుగ పురస్కరించుకుని ఒకటవ డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజు గోమాత సేవ చేశారు.
తన గోశాల నందు వున్న గోమాతకు శుభ్రంగా స్నానం చేయించడం దగ్గర నుండీ పసుపు కుంకుమలతో అలంకరించి, నైవేద్యం సమర్పించడం వరకూ అన్నీ పనులు తానే స్వయంగా చేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సంక్రాంతి తరువాతి రోజున వచ్చే పండుగ కనుమ.
కనుమ రోజున చేసుకునేది పశువుల పండుగ. సంవత్సరం మొత్తం మనుషులకు చేసిన సేవలకు ప్రతిరూపంగా పశువులను పూజించి, ఆరాధించే రోజును పండుగలా జరుపుకోవడం భారతీయ సనాతన సంప్రదాయాల్లో చాలా ముఖ్యమైనదని తెలిపారు.
కనుమ రోజున గోమాత సేవ చేసుకున్నవారికి ఆ గోవులో నిలయమున్న ముక్కోటి దేవీదేవతల అనుగ్రహం లభించి, సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తారంటూ ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.