తల్లిదండ్రులను గౌరవించండి : తోటపల్లిగూడూరు సబ్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి
తల్లిదండ్రులను గౌరవించండి
తోటపల్లిగూడూరు సబ్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి
తోటపల్లి గూడూరు, మార్చి 22 (సదా మీకోసం) :
విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి, ఉపాధ్యాయులు చెప్పే నైతిక విలువలు పాటించి మంచి పౌరసమాజాన్ని నిర్మించాలని తోటపల్లిగూడూరు సబ్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి కోరారు.
చిన్న పల్లిపాలెం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్సై గారు విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహణలో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మనల్ని కన్న తల్లిదండ్రులను గౌరవించి వారి చెప్పినట్టు నడుచుకుంటూ, పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా విని ఉత్తమ విద్యార్థుల గా గుర్తింపు పొంది జీవితంలో ఉత్తమ పౌరులుగా స్థిరపడాలని, చెడు మార్గంలో విద్యార్థులు వెళితే జీవితమంతా కష్టాలు పడాల్సి వస్తుందని, ఉదాహరణలతో వివరించారు.
దిశ యాప్, శాంతిభద్రతలు, చట్టాలు, పోలీసులు విధి నిర్వహణ, నైతిక విలువలు పట్ల విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు..
ఈవ్ టీజింగ్ కు పాల్పడుతున్న కొంత మంది యువతకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి రూప, పిడి సుమతి, చంద్రశేఖర్, మురళి, ఫణి కుమార్, విద్యాధరి, కానిస్టేబుల్ శ్రీనివాసులు, వెంకట్రామిరెడ్డి, గ్రామస్తులు సీనయ్య, దేవా, మురళి తదితరులు పాల్గొన్నారు.