ధాన్యం న‌గ‌దు రైతుల ఖాతాల్లొ జ‌మ చేయాలని.. ఆర్బీకేల‌పై త‌హ‌సిల్దార్‌కు మిడ‌త‌ల ర‌మేస్ విజ్ఞ‌ప్తి

0
Spread the love

ధాన్యం న‌గ‌దు రైతుల ఖాతాల్లొ జ‌మ చేయాలి

ఆర్బీకేల‌పై త‌హ‌సిల్దార్‌కు మిడ‌త‌ల ర‌మేస్ విజ్ఞ‌ప్తి

కొడవలూరు, మార్చి 22 (స‌దా మీకోసం) :

ఆర్ బి కె లు కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని అలాగే మండలంలో మద్దతు ధరకే ధాన్యం విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కొడవలూరు తహసిల్దారు కు బిజెపి నమామి గంగే రాష్ట్ర ప్రముక్ మిడతల రమేష్ విజ్ఞప్తి చేశారు.

ఎల్లయ్య పాలెం సొసైటి ద్వారా నాలుగు గ్రామాల రైతులు కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయిస్తే నెల రోజులు దాటినా రైతుల ఖాతాల్లో నగదు జమ కాలేద‌ని పేర్కొన్నారు.

కూలీలకు, ట్రాక్టర్లకు, వరి కోత మిషన్ ల‌కు డబ్బులు చెల్లించలేక రైతులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను తహసీల్దార్ కు వివరించారు.

మండలంలోని పలు గ్రామాలలో మద్దతు ధర లభించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. తేమ పేరుతో, విరుగుడు పేరుతో రేటు తగ్గించి రైతుల వద్ద ధాన్యం సేకరిస్తున్నారని అన్నారు.

జిల్లాలోని రైస్ మిల్లులలో ధాన్యం నిల్వలు పేరుకుపోయి ఉన్నాయని, మిల్లర్ల ఇచ్చే బియ్యాన్ని ఎఫ్ సి ఐ తీసుకోకపోవడంతో మిల్లర్లు ఆర్ బి కే ల ద్వారా ధాన్యాన్ని సేకరించడం లేదన్నారు.

ఆ ప్రభావంతో దాన్యం మద్దతు ధర పతనమై దళారులకు రైతులు పంట ను నష్టానికి విక్రయించు కుంటున్నారని తెలిపారు.

అడంగల్ లో నమోదు కాని భూములలో ధాన్యాన్ని సాగు చేస్తే ఆర్ బి కే ద్వారా విక్రయించు కోలేకపోతున్నారని, అడంగులులో నమోదు కానీ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆమె కు విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు మురళీకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!