స్పందన వేదికను సద్వినియోగం చేసుకోండి – కమిషనర్ హరిత
స్పందన వేదికను సద్వినియోగం చేసుకోండి
– కమిషనర్ హరిత –
ప్రజా సమస్యల పరిష్కార వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కమిషనర్ హరిత ఆకాంక్షించారు.
తే17-10-22ది సోమవారం నాడు కార్యాలయంలో జరిగే స్పందన వేదికలో సమస్యల పరిష్కారం కోసం ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమంలో భాగంగా ఉదయం 9:30 నుంచి 10:30 వరకు 0861-2355678 నెంబరుకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని, అనంతరం కార్యాలయంలో కమిషనర్ ను నేరుగా కలిసి సమస్యలను ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
అందుకున్న సమస్యలను వీలున్నంత త్వరగా పరిష్కారం అందించేందుకు అన్ని విభాగాలను సమన్వయం చేసుకొని కృషి చేస్తామని కమిషనర్ తెలిపారు.