వి.ఎస్.యూలో నైపుణ్యాభివృద్ది సంస్ధ ఉద్యోగమేళ
వి.ఎస్.యూలో నైపుణ్యాభివృద్ది సంస్ధ ఉద్యోగమేళ
వెంకటాచలం, ఫిబ్రవరి 16 (సదా మీకోసం) :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ సహకారంతో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉద్యోగ మేళా నిర్వహించారు.
రిలయన్స్ నిప్పాన్, శ్రీ రామ్ సిటి యూనియన్ ఫైనాన్స్, భారత్ ఎఫ్.ఐ.హెచ్ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ సందర్భంగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం సర్ సి.వి. రామన్ సెమినార్ హాల్ నందు ఇంటర్వులు నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి యం సుందరవల్లి మాట్లాడతూ విద్యార్ధులు ఇలాంటి అవకాశాలలో చురుకుగా పాల్గొని వారి ప్రతిభను నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలని, ఇలాంటి కార్యక్రమాలు విశ్వవిద్యాలయంలో మరెన్నో చేస్తామని తెలియచేసారు.
అదేవిధంగా ఎంపికైన వారికి ఉపకులపతి చేతులమీదుగా నియామక పత్రాలు అందజేశారు.
రెక్టర్ ఆచార్య యం .చంద్రయ్య, రిజిస్ట్రార్ డా ఎల్ విజయ కృష్ణ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్ నాయర్ ఎంపికైన విద్యార్ధులకు అభినందనలు తెలియజేశారు.
ఈ ఇంటర్యూ లకు 93 మంది విద్యార్ధులు రిజిస్టర్ చేసుకోగా వారిలో 43 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోఆర్డినేటర్ డా సి హెచ్ విజయ, ప్లేస్ మెంట్ అధికారి డా పి.చెంచు రెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో అబ్దుల్ ఖయ్యుమ్ డిస్ట్రిక్ మేనేజర్ మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా జరిగే ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో శ్రీమాన్ నారాయణ, సెట్ నల్ ఇంచార్జ్ సి ఇ ఓ, ఓ.జనార్ధన్ ప్లేస్ మెంట్ అధికారి, మరియు ఉమాసుమాలిని, హరిక్రిష్ణ, శ్రీనివాస్, ఎపి యస్ యస్ డిసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.