వర్షాలకు దెబ్బతిన్న రైతులకు సబ్సిడీపై విత్తనాలు..! : వ్యవసాయ అధికారి గీతాకుమారి
వర్షాలకు దెబ్బతిన్న రైతులకు సబ్సిడీపై విత్తనాలు..!
-వ్యవసాయ అధికారి గీతాకుమారి..!!
తోటపల్లిగూడూరుడిసెంబర్ 1 (సదా మీకోసం) :
వర్షాలకు దెబ్బతిన్న బాధిత రైతులకు సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారి యు. గీతాకుమారి పేర్కొన్నారు.
ఈ మేరకు బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె చెప్పారు.
ఈ సందర్భంగా గీతాకుమారి మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలో 498 ఎకరాలకు సరిపడా నారుమడులు దెబ్బతిన్నాయన్నారు.
వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీ కింద విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు గీతాకుమారి తెలిపారు.
సబ్సిడీపై ఎన్ ఎల్ ఆర్ 34449 వరి రకం 23.5 క్వింటాళ్లు, ఆర్ ఎన్ ఆర్ 15048 వరి రకం 50.5 క్వింటాళ్లు వరి విత్తనాలను మండలంలోని తోటపల్లిగూడూరు బిట్-1, పేడూరు, వరిగొండ బిట్-1, 2, చిన్నచెరుకూరు, మాచర్లవారిపాలెం, నరుకూరు, ఇస్కపాలెం రైతు భరోసా కేంద్రాల ద్వారా బాధిత రైతులకు అందజేయడం జరుగుతుందన్నారు.
ఎన్ ఎల్ ఆర్ 34449 వరి విత్తనాలు ఒక బస్తా పూర్తి ధర రూ. 990 కాగా 80 శాతం సబ్సిడీ పోను కేవలం రూ. 198లకే పంపిణీ చేయడం జరుగుతుందని అమె చెప్పారు.
అలాగే 5204 రకం విత్తనాల అసలు ధర రూ. 952 కాగా సబ్సిడీ పోను రూ. 190, అదేవిధంగా ఆర్ ఎన్ ఆర్ 15048 రకం వరి విత్తనాలు బస్తా ధర రూ. 921 కాగా, అందులో సబ్సిడీ పోను రూ. 185లకే పంపిణీ చేస్తున్నట్లు గీతాకుమారి తెలిపారు.
నారుమడులు నష్టపోయిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.