పదవీ వ్యామోహంతో జిల్లా అధ్యక్ష పదవిలో ఊగులాడే నువ్వా మాట్లాడేది : రూప్ కుమార్

0
Spread the love

 

పదవీ వ్యామోహంతో జిల్లా అధ్యక్ష పదవిలో ఊగులాడే నువ్వా మాట్లాడేది

టిడిపి నేత బీదా రవిచంద్ర పై రూప్ కుమార్ యాద‌వ్‌ ధ్వజం

-: నెల్లూరు న‌గ‌రం‌, ఆగస్టు 5 (స‌దా మీకోసం) :-

నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న నీ స‌మ‌యంలోనే జిల్లాలో ఒక్క స్థానంలో కూడా గెలవకుండా పూర్తిస్థాయిలో తుడిచిపెట్టుకుపోయింద‌న్నారు.

అయినా కనీస నైతిక విలువలకు కట్టుబడి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయకుండా పదవి వ్యామోహంతో టిడిపి జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఊగులాడుతున్నారని వైసిపి జిల్లా నేత యువజన విభాగం అధ్యక్షుడు రూప్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు.

నెల్లూరు జిల్లా కేంద్రంలోని వైసిపి జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీద రవిచంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఆయన నాయకత్వంలో టీడీపీ జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు పార్లమెంటు స్థానాలను ఓటమి పాలైందని ఎద్దేవా చేశారు.

మంత్రి అనిల్ ను రాజీనామా చేయమనే హక్కు నీకు ఎక్కడిదని ప్రశ్నించారు.

కనీసం సర్పంచ్ గా కూడా బీద రవిచంద్ర ఎక్కడ గెలవలేదని కొండాపురంలో ఒకసారి ఏకగ్రీవం మాత్రమే జరిగిందన్నారు.

తమ మంత్రి ఒక కొండను ఢీకొని తన సత్తాను నిరూపించుకున్నారన్నారు.

సొంత నియోజకవర్గమైన కావలిలోనే రవిచంద్ర 14 వేల ఓట్ల తేడాతో తమ అభ్యర్థిని గెలిపించుకోలేక ఓటమిపాలయ్యారన్నారు.

సిగ్గు లేకుండా బీదా రవిచంద్ర మాట్లాడుతున్నారని విమర్శించారు. టిడిపి కి దమ్ముంటే 23 స్థానాల్లో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు.

మంత్రి జోలికి జిల్లా వైసిపి జోలికొస్తే బాగుండదని గతంలో కొంత మందికి ఇది చాలా సందర్భాల్లో నిరూపితమైందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

error: Content is protected !!