తాళిబొట్లు తెంచేందుకేనా ప్రజలు అధికారమిచ్చింది..? : సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి
తాళిబొట్లు తెంచేందుకేనా ప్రజలు అధికారమిచ్చింది..?
సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి
- కల్తీ మద్యం తాగి వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు
- మీడియా ముందుకు రాని మరణాలు ఎన్నో జరుగుతున్నాయి
- ‘జంగారెడ్డిగూడెం కల్తీ మరణాలకు ప్రభుత్వ హత్యలు కాదా..?
- నెల్లూరులో కూడా కల్తీమద్యం తాగి ఒక వ్యక్తి మరణిస్తే.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదు
- తాళిబొట్లు తెంచుతున్న జగన్ కు పుట్టగతులుండవ్
- ఆడవారి కన్నిటీల్లో వైసీపీ పాలన అంతమవ్వడం ఖాయం
నెల్లూరు నగరం, మార్చి 21 (సదా మీకోసం) :
పరిపాలన చెయ్యమని అధికామిస్తే… సీఎం జగన్మోహన్ రెడ్డి ఆడవారి మంగళసూత్రాలు తెంచేస్తున్నారని టీడీపీ నెల్లూరుసిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ అదికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చాయన్నారు.
మద్యంలో స్పిరిట్ వాడటం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జే – బ్రాండ్స్ ను వెంటనే నిషేదించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు సిటీలోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
మహిళలను సమీకరించుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మండుటెండలు జగన్ తీరును ఎండగట్టారు. ఒక వృద్దునికి మద్యం సీసాలు మెడలు వేసి. ఈ కల్తీమద్యం ఆరోగ్యం సన్నగిల్లుతోందంటూ ఆయన చేత మాట్లాడించాడు.
అనంతరం మద్యం సీసాలను పగలగొడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
హత్యలు చెయ్యడం జగన్ కు మామూలే
స్వంత చిన్నాన్నను చంపేసిన జగన్మోహన్ రెడ్డి.. రాష్టంలో ఉండే మహిళల తాళిబొట్లు కూడా తెంచేస్తున్నాడని ధ్వజమెత్తారు. మార్కెట్ లో ఉన్న జగన్ బ్రాండ్స్ తాగితే స్లో పాయిజన్ తాగినట్లేనని. ల్యాబ్ లో అది నిరూపితమైందన్నారు. ఓట్లేసిన ప్రజలను జగన్మోహన్ రెడ్డి రాక్షసుడిలా చంపేస్తున్నారని మండిపడ్డారు.
నెల్లూరు సిటీలో ఒకరు చనిపోయారు
నెల్లూరు సిటీ నియోజకవర్డంలో కూడా కల్తీ మద్యం తాగి ఒకరు చనిపోయారని, వారి కుటుంబాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆయన అన్నారు.
మహిళలందరూ ఒక్కటై.. జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపితేనే.. ఈ కల్తీ మద్యం మరణాలు ఆగుతాయన్నారు.
మంత్రి అనీల్ దృష్టంతా క్రికెట్ బెట్టింగ్ మీద, పెన్నా ఇసుక అక్రమ రవాణా మీద ఉందన్నారు. ఆడవారి కన్నీటికి కారణమవుతున్న ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సుబ్బారావు, మాజీ కార్పొరేటర్ పిట్టి సత్యనాగేశ్వర్ రావు, కువ్వారపు బాలాజీ, నగర మహిళా అధ్యక్షురాలు రేవతి, పొత్తూరి శైలజ, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు.