ఏప్రిల్ 10న “మన భూమి – మన ఆరోగ్యం – మన హక్కు – ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం” సదస్సు

ఏప్రిల్ 10న “మన భూమి – మన ఆరోగ్యం – మన హక్కు – ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం” సదస్సు
నెల్లూరు వైద్యం, ఏప్రిల్ 8 (సదా మీకోసం)
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 10వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు నెల్లూరు నగరంలోని డాక్టర్ శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో “మన భూమి – మన ఆరోగ్యం – మన హక్కు – ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం” అనే అంశంపై సదస్సు జరుగుతుందని ప్రజారోగ్య వేదిక నెల్లూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ బి రాజేశ్వరరావు, జి శ్రీనివాసరావు లు ఒక ప్రకటనలో తెలిపారు.
డాక్టర్ శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం, ప్రజారోగ్య వేదిక, మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్, ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని వారు కోరారు.
కార్యక్రమంలో ప్రధాన ఉపన్యాసకులుగా జనవిజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ బ్రహ్మారెడ్డి హాజరై పై అంశాలను వివరిస్తారని పేర్కొన్నారు.