ముంగ‌మూరు శ్రీధ‌ర్ అన్నా.. నా కుటుంబ స‌భ్యుడు : టిడిపి సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసుల‌రెడ్డి

0
Spread the love

ముంగ‌మూరు శ్రీధ‌ర్ అన్నా.. నా కుటుంబ స‌భ్యుడు

టిడిపి సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసుల‌రెడ్డి

నెల్లూరు న‌గ‌రం, మార్చి 21 (స‌దా మీకోసం) :

గ‌త రెండువారాలుగా నెల్లూరులోని విఆర్సీ మైదానంలో జ‌రుగుతున్న ముంగ‌మూరు శ్రీధ‌ర్ కృష్ణారెడ్డి మెమోరియ‌ల్ క్రికెట్ పోటీలు ముగిశాయి.

తొలిరోజు తెలుగుదేశం పార్టీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసుల‌రెడ్డి, జిల్లా అధ్య‌క్షులు అబ్దులు అజీజ్ ఈ టోర్న‌మెంట్ ను ప్రారంచారు.

సోమ‌వారం ముగింపు కార్య‌క్ర‌మంలో కోటంరెడ్డి పాల్గొని విజేత‌ల‌కు బ‌హుమ‌తులు అంద‌జేశారు.

ఎన్ ఎస్ ఆర్ లెవెల్స్ మొద‌టి బహుమ‌తి కింద 20వేలు గెలుచుకోగా.. వెంకీ లెవ‌ల్స్ ర‌న్న‌ర్ గా నిలిచింది. 

వీరికి కోటంరెడ్డి బహుమ‌తులు, ప్రైజ్ మ‌నీ అంద‌జేశారు. ముంగ‌మూరు శ్రీధ‌ర్ కృష్ణారెడ్డి లోకాన్ని విడిచి వెళ్లినా.. కార్య‌క‌ర్త‌ల గుండెల్లో ఎప్పుడు బ‌తికే ఉంటార‌ని ఆయ‌న అన్నారు. ఆయ‌న త‌న కుటుంబ స‌భ్యులు లాంటివారని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.

కార్యక్రమంలో లో నగర అధ్యక్షులు ధర్మారావు సుబ్బారావు, పార్లమెంట్ బిసి సెల్ అధ్యక్షులు శ్రీనివాసులు, సత్య నాగేశ్వరరావు, రేవతి, ఏడుకొండలు, నారా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!