పార్టీల‌క‌తీంతంగా రైతుల నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొనండి… గూడూరులో పిలుపునిచ్చిన పాశిం సునీల్‌

0
Spread the love

పార్టీల‌క‌తీంతంగా రైతుల నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొనండి

గూడూరులో పిలుపునిచ్చిన పాశిం సునీల్‌

గూడూరు, మార్చి 22 (స‌దా మీకోసం) :

తెలుగుదేశం పార్టీ పాలిట్ భ్యూరో స‌భ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధాన్యం గిట్టుబాటు ధర పై బుధ‌వారం నెల్లూరు నందు జరిగే నిరసన కార్యక్రమంలో పార్టీల కతీతముగా నియోజకవర్గంలోని రైతులందరూ పాల్గొనాలని గూడూరు మాజీ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు.

గూడూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు రైతుల పరిస్థితి చూస్తుంటే గిట్టుబాటు ధర లేక వారు చాలా నష్టపోతున్నారన్నారు.

వర్షాలు పడి రైతులు పంటలు బాగా పండించిన గాని, గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

మా పెద్దలు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లాలో విస్తృతంగా తిరిగి ఎక్కడైతే కల్లాలు ఉంటాయో, నేరుగా వెళ్లి విచారిస్తే, వారికి గిట్టుబాటు ధరలు అందడం లేదని తెలుసుకున్నారన్నారు.

ఈ ప్రభుత్వం పేరుకి రైతులు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకి కొంటామని రైతు భరోసా కేంద్రాలలో పాంప్లెట్లు వేయించి ప్రచారాలు చేసుకోవడమే తప్ప, జిల్లాలో ఒక ధాన్యపు గింజ కూడా కొన్న దాఖలాలు లేవన్నారు.

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికి, ఈ జిల్లాలో ఉన్న మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని ఒక్కరూ కూడా ముఖ్యమంత్రికి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు పడుతున్న ఇబ్బందులు తెలియజేయలేక పోతున్నారని తెలిపారు.

గత ప్రభుత్వంలో మా నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి వర్యులకి రైతులు పండించిన పంటకు గిట్టు బాటు ధరలు లభించడం లేదని చెప్పి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించారని తెలిపారు.

రేపు నెల్లూరు లో నర్తకి సెంటర్ నుండి కలెక్టర్ గారి కార్యాలయం వరకు జరిగే నిరసనలో పార్టీలకతీతముగా నియోజకవర్గంలోని రైతులు పాల్గొనాల‌ని అన్నారు.

కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, గూడూరు మండల పార్టీ అధ్యక్షులు కొండూరు వెంకటేశ్వర్లు రాజు, చిల్లకూరు మండలం ప్రధాన కార్యదర్శి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!