జగన్ రెడ్డి బాదే బాదుడు ప్రజలకు వివరిస్తాం…చైతన్య పరుస్తాం… : నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్
జగన్ రెడ్డి బాదే బాదుడు ప్రజలకు వివరిస్తాం…చైతన్య పరుస్తాం…
- శ్రీధర్ రెడ్డి దొంగ నాటకాలు, బుడబుక్కల వేషాలు వర్ణనాతీతం…
- రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇంటి ఇంటికి వస్తున్నాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండండి…
- నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్
నెల్లూరు రూరల్, ఏప్రిల్ 13 (సదా మీకోసం) :
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 36 వ డివిజన్ అంబేడ్కర్ నగర్, బ్రహ్మానంద పురం లో పెంచిన విద్యుత్, నిత్యావసరాలు, పెట్రోల్ ధరలకు నిరసనగా రసూల్, ఆనంద్, భాస్కర్, మునీర్, ఇజ్రాయేల్, మారుతి ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.
టీడీపీ నేతలు కార్యకర్తలు వినూత్న రీతిలో అర్ధనగ్న ప్రదర్శన తో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు,రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ (Abdul Azeez) మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్ళపాక అనురాధ తో కలిసి ఇంటి ఇంటికి తిరిగి జగన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను, పెంచిన ధరల గురించి వివరించారు.
బాదుడే బాదుడు అంటూ ప్లకార్డులు పట్టుకుని, టీషర్ట్ లు వేసుకుని, రాబోయే రోజుల్లో లాంతర్లే గతి అంటూ, పెంచిన విధ్యుత్ చార్జిలను రద్దు చేయాలని, అప్రకటిత విధ్యుత్ కోతలు ఎత్తి వేయాలని, జగన్ రెడ్డి బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేస్తూ ప్రతి ఇంటికి ఒక విసనకర్ర, కొవ్వొత్తి, అగ్గిపెట్టె, పంపిణీ చేశారు..
అనంతరం అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) ఇంటింటికి తిరుగుతున్నారని, రూరల్ ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని, మి ఇంట్లో ఏం ఉంటే వాటిని శ్రీధర్ రెడ్డి దొచుకుపోతరని విమర్శించారు.
ఆంధ్ర రాష్ట్రం కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2 వ స్థానం లో , రైతుల ఆత్మహత్యల్లో 4 వ స్థానం లో ఉందని, నూతనంగా ఎన్నికైన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు కాకాణి గారు వ్యవసాయ రంగాన్ని అభివృధి చేయాలని సూచించారు.
జగన్ రెడ్డి ప్రజలపై మోపుతున్న భారాన్ని బాదుతున్న బాడుడిని ప్రజలకు వివరించి, చైతన్య పరుస్తామని తెలిపారు.
ముందుచూపు లేకపోవడమే ఈ విధ్యుత్ అనర్ధాలకు కారణమని, పనికిమాలిన సలహాదారులను పలన ప్రజలకు మరియు ఖజానాకు భారం తప్ప రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని అన్నారు. గతంలో చంద్రబాబు విద్యుత్ చార్జీలను పెంచకపోయినా పెంచారంటూ అసత్యపు మాటలు చెప్పి ప్రజలను నమ్మించారు. నేడు అదే జగన్ ఈ మూడేళ్లలో 7 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి పేదల నడ్డి విరిచారన్నారు. పల్లెలు పట్టణాలు అని తేడా లేకుండా ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తూ నమ్మి ఓట్లేసిన ప్రజలకు నరకం చూపిస్తున్నాడు జగన్ రెడ్డి.ఒక ప్రక్క కోతలు విధిస్తూ విద్యుత్ చార్జీలు భారీగా పెంచిన జగన్ పేదల నడ్డి విరుస్తున్నాడన్నారు.
కార్యక్రమంలో జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, కనపర్తి గంగాధర్, ఈదర శ్రీనివాసులు, అబీద సుల్తానా,గోడా పద్మ, రేవతి, మల్లిక, వనజా రెడ్డి, సుధీర్ రెడ్డి, శ్రీనాథ్, రమేష్ చౌదరి, మురళి, సాజీద్, సుబ్రహ్మణ్యం, బాలకృష్ణ, వెంకట లక్ష్మీ, సుబ్బారాయుడు, తదితరులు పాల్గొన్నారు.