మీరు, మీ ప్రభుత్వం రైతును నిలువునా ముంచి ఐఏఎస్ లపై నెపం నెడతారా!

0
Spread the love

మీరు, మీ ప్రభుత్వం రైతును నిలువునా ముంచి ఐఏఎస్ లపై నెపం నెడతారా!

✍️ప్రసన్న గారు…. మీ ప్రభుత్వం, మీరు కలిసి ధాన్యం రైతులను నిలువునా ముంచి, ఆ నెపం ఐఏఎస్ అధికారాలు పై నెడతారా!

✍️ఈరాష్ట్రంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించమని చెప్పి ఉంటే ఆ మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఏ అధికారికైనా ఉందా! ఉంటే మీ ప్రభుత్వం చెప్పిన చట్టవిరుద్ద పనులు చేసి న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడతారా!

✍️మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కలిపిస్తామని ప్రతిపక్షంలో ఉన్నపుడు ఊరు,వాడ తిరిగి చెప్పారు.ఆ నిధి ఏమైంది.

✍️గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర రాకపోతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కేవలం నెల్లూరు జిల్లా వరకే ధాన్యానికి బోనస్ ఇప్పించాము.

✍️ధాన్యం గిట్టుబాటు ధర గురించి మీరుగాని,మీ మంత్రులు గాని, మీ శాసనసభ్యులు గాని ఒక్కసారైనా ముఖ్యమంత్రి ని కలిసి వివరించారా!

✍️మీ వైసీపీ పాలనలో తప్ప కోవూరు చరిత్రలోఎన్నడైన రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించారా!

తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి

-: కోవూరు, ఏప్రిల్ 4 (సదా మీకోసం) :-

కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయములో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో కోవూరు మాజీ జడ్పీటీసీ సభ్యులు,తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, నిన్న కోవూరులో జరిగిన ఒక కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిత్యం రైతులు గురించి ఆలోచిస్తూ ఉంటాడని, కానీ రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ అధికారులు వలననే రైతులకే ధాన్యానికి గిట్టుబాటు ధర రాలేదని చెప్పారు.ఇది అడలేక మద్దెల ఓడు అనే సామెత లాగా ఉందన్నారు.

ఈరాష్ట్రంలో మీ జగన్మోహన్ రెడ్డి నిజంగా ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించమని అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఉంటే , ఆ మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఏ అధికారికైనా ఈరాష్ట్రంలో ఉందా! ఉంటే మీ ప్రభుత్వం చెప్పిన చట్టవిరుద్ద పనులు చేసి న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడతారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కలిపిస్తామని ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్మోహన్ రెడ్డి గారు ఊరు,వాడ తిరిగి చెప్పారు.అధికారంలోకి వచ్చిన తరువాత ఆ నిధిని ఏర్పాటు చేసి ఒక్క రైతుకైనా గిట్టుబాటు ధర కల్పించారా అని ప్రశ్నించారు.

గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర రాకపోతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కేవలం నెల్లూరు జిల్లా వరకే ధాన్యానికి బోనస్ ఇప్పించామని గుర్తు చేశారు.

గత మూడు సంవత్సరాలు గా నెల్లూరు జిల్లా లో ధాన్యానికి గిట్టుబాటు ధర రాక ధాన్యం రైతులు దాదాపు రూ.3000 కోట్లు నష్టపోతే,మీరు గాని,ఈ జిల్లాకు చెందిన మంత్రులు గాని శాసనసభ్యులు గాని ఒక్కసారి అయిన ముఖ్యమంత్రి ని కలిసి రైతుల పరిస్థితి వివరించారా,అసలకు మీ ముఖ్యమంత్రి తో మాట్లాడే ధైర్యం మీకు ఉందా అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి చేతగాని తనము వలనే ఈరోజు నెల్లూరు జిల్లాలో ధాన్యం పండించిన రైతులు నష్ట పోయారు.పుట్టి ధాన్యాన్ని 16,600 లకు కొనుగోలు చేయవలసి ఉండగా ఈరోజు 12,000 లకు కూడా కొనే దిక్కులేదు.రైతు భరోషా కేంద్రాలు రైతు భక్షక కేంద్రాలుగా మారాయన్నారు.

ఒక వైపు పెరిగిన సాగు ఖరులు,మరో వైపు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక దొక్కుతోచని పరిస్థితులలో ఉన్న కోవూరు రైతాంగం క్రాఫ్ హాలిడే ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు అంటే పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అర్ధమవుతుందని తెలిపారు.

మీ ప్రభుత్వ పాలనలో తప్ప ఎప్పుడైనా కోవూరులో రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించిన సందర్భాలు ఉన్నాయన్నారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ,వ్యవసాయ శాఖ మంత్రి కానీ,పౌరసరఫరాల శాఖ మంత్రి కానీ ఏనాడైనా ధాన్యం కొనుగోళ్లు పై సమీక్ష చేసారా అని ప్రశ్నించారు.

పొరుగు రాష్ట్రం అయిన తెలంగాణాలో రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ధాన్యం కొనుగోలు. చేయడమే కాకుండా,ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతులకు చెల్లింపులు చేస్తున్నారు.వారిని చూసైనా మీరు నేర్చుకోండని హితవు పలికారు.

మీరు శాసనసభ్యుడుగా ఉన్న సమయంలో రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించారు.అంటే మీరు సిగ్గుపడాలి.ఇప్పటికైన ఎవరో ఒకరి పై నిందలు వేయడం మాని ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేందుకు చిత్తశుద్ధితో కృషి చెయ్యండన్నారు.

కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!