ఏపీలో మూతపడిన వ్యవసాయ శాఖ : మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

0
Spread the love

ఏపీలో మూతపడిన వ్యవసాయ శాఖ

రైతులకు వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి

ఈ రెండున్నరేళ్లలో వ్యవసాయంలో ఫలనాదానికి ఇంత ఖర్చు పెట్టామని చెప్పే ధైర్యం సీఎంకి ఉందా

అమరావతిలో మీడియాతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

-: అమరావతి, సెప్టెంబర్ 12 (సదా మీకోసం) :-

  •  వ్యవసాయరంగానికి, రైతులకు సంబంధించిన ఏ పథకంలోనైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశంలో ముందంజలో ఉందా?
  •  టీడీపీ హయాంలో వ్యవసాయ అనుబంధరంగాల్లో 11శాతం వృద్ధిరేటు నమోదైతే, ఈ ప్రభుత్వంలో ఎంతనమోదైందో చెప్పగలరా?
  •  రైతు లేకపోతే దేశమే లేదనే వాస్తవాన్ని పాలకులు ఎందుకు విస్మరిస్తున్నారు.
  •  వ్యవసాయమంటే తెలియని కన్నబాబుకి వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ పదానికి స్పెల్లింగ్ తెలియని అనిల్ కుమార్ కు నీటిపారుదలశాఖ, ఆరోగ్యమంటే తెలియని ఆళ్లనానికి వైద్యారోగ్యశాఖ అప్పగించారు.
  • వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో వ్యవసాయరంగానికి సంబంధించిన పథకాలన్నీ అటకెక్కాయి.
  • టీడీపీప్రభుత్వం ప్రతిరైతుకి రూ.9వేలు ఇస్తే, జగన్ రైతుభరోసా కింద దాన్ని రూ.7,500లకు పరిమితం చేశారు.
  •  భూసారపరీక్షలు, బిందుతుంపర్ల సేద్యం పరికరాలపంపిణీ, రైతులకు అందించే సూక్ష్మపోషకాల పంపిణీని జగన్ ప్రభుత్వం ఆపేసింది.
  • కోటి 20 లక్షల మంది రైతులకు భూసారపరీక్ష కార్డులు పంపిణీచేసి, సూక్షపోషకాలను మా ప్రభుత్వంలో ఉచితంగా అందించాము.
  •  కేంద్ర ప్రభుత్వం బిందుతుంపర్ల సేద్యానికి 60శాతం సబ్సిడీ ఇస్తుంటే, జగన్మోహన్ రెడ్డి 40శాతం ఇవ్వలేక, ఆ పథకాన్నీ నిలిపేశారు.
  • కర్నూలులో చంద్రబాబునాయుడు చేపట్టిన మెగాసీడ్ పార్క్ ను మూతేశారు.
  •  2013-14లో వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.6,200లుగా ఉన్న బడ్జెట్ కేటాయింపులను 2018-19నాటికి రూ.18,500 కోట్లకు పెంచాము.
  • 2019-20లో బడ్జెట్లో రూ.20వేలకోట్లు కేటాయించిన వైసీపీ ప్రభుత్వం అందులో కేవలం రూ.7వేలకోట్లు మాత్రమే ఖర్చుపెట్టింది.
  • ఆ మొత్తంలోనూ సగం వ్యవసాయశాఖ ఉద్యోగుల జీతాలకే వెచ్చించింది.
  • వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలకు టీడీపీప్రభుత్వం రూ.1700కోట్లు ఖర్చుపెడితే, జగన్మోహన్ రెడ్డి రూపాయి కూడా ఖర్చుచేయలేదు.
  •  మా ప్రభుత్వంలో 20వేల ట్రాక్టర్లను రైతురథంపథకం కింద పంపిణీ చేశాము.
  • జగన్ ప్రభుత్వం ఒక్కరైతుకి కూడా ఎక్కడా ఒక్క నాగలి కూడా ఇచ్చిందిలేదు.
  • ఈ రెండున్నరేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద రైతులకు జగన్ ప్రభుత్వం ఎంతఖర్చుపెట్టిందో సమాధానం చెప్పాలి.
  • వ్యవసాయశాఖలో పలానా దానికి ఇంత ఖర్చు పెట్టామని చెప్పగల ధైర్యం ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖ మంత్రికి ఉందా..
  •  గతంలో టీడీపీ ప్రభుత్వంపై రైతులకు జగన్ అండ్ కో పచ్చి అబద్ధాలు చెప్పింది..అలా మాపై ఒకరకమైన వ్యతిరేకతను సృష్టించడంలో సఫలీకృతులయ్యారు.
  • కానీ వాస్తవాలు మాత్రం వారి దుష్ప్రచారానికి పూర్తిభిన్నంగా ఉన్నాయి.
  •  టీడీపీ ప్రభుత్వం రైతులపై చూపినశ్రద్ధ, వారికందించినచేయూత మాటల్లో చెప్పలేనిది. రైతుల కోసం, వ్యవసాయ రంగాభివృద్ధికోసం నిద్రాహారాలుమాని, రేయింబవళ్లు శ్రమించాము.
  •  రైతులకు న్యాయంచేసే విషయంలో తాముగానీ, తమ ప్రభుత్వంగానీ ఎక్కడా రాజీపడలేదు.
  • ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా రైతులవిషయంలో వెనకడుగు వేయలేదు.
  •  ఈ రెండున్నరేళ్లలో జగన్ ప్రభుత్వం రైతాంగానికి వెన్నుపోటు పొడిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
  •  కేంద్ర, రాష్ట్రప్రభుత్వ పథకాలకింద రైతులకు, వ్యవసాయరంగానికి జగన్ ప్రభుత్వం ఎంతఖర్చుపెట్టిందో సమాధానం చెప్పాలి.
  •  టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రవాటాకింద ప్రతి రైతుకుటుంబానికి రూ.9వేలవరకు నిర్ణయించాము..
  •  ఇప్పుడు ఆ పథకానికే జగన్మోహన్ రెడ్డి రైతుభరోసా అని పేరుపెట్టి, ఇచ్చే సాయాన్ని రూ.7,500లకు తగ్గించారు..
  •  రైతుల సంఖ్యను కూడా 50 లక్షలకే పరిమితంచేశారు..
  •  భరోసా కింద ఇచ్చే రూ.3500కోట్లు, వ్యవసాయ శాఖ జీతభత్యాలు తప్ప, ప్రత్యేకంగా ఈ ముఖ్యమంత్రి వ్యవసాయానికి, రైతులకు ఏంచేస్తున్నారో ఆయనే చెప్పాలి.
  • 2013-14లో వ్యవసాయ,అనుబంధరంగాలకు బడ్జెట్ కేటాయింపులు రూ.6,200కోట్లుంటే, దాన్ని టీడీపీప్రభుత్వం 2018-19 నాటికి రూ.18, 500కోట్లకు పెంచాం..
  • జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019లో వ్యవసాయ, అనుబంధరంగాలకు రూ.20వేల కోట్లుకేటాయించి, కేవలం రూ.7,400 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టింది.
  • ఆ మొత్తంలో సగంసొమ్ముని వ్యవసాయ శాఖ ఉద్యోగులజీతభత్యాలకే వెచ్చించారు.
  •  కేటాయించిన సొమ్ములో కనీసం మూడో వంతుకూడా అన్నదాతల కోసం వెచ్చించడానికి జగన్మోహన్ రెడ్డికి మనసురాకపోవడం దురదృష్టకరం.
  • ఈ ప్రభుత్వంలో రైతులు పడే అవస్థలు, బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
  •  దేశానికి అన్నంపెట్టే రైతులవిషయంలో పాలకులు మోసపూరితంగా, అన్యాయంగా వ్యవహరించడం దుర్మార్గం.
  •  పండించిన ఉత్పత్తులకు గిట్టు టాటుధరలేక, వ్యవసాయకూలీలకు ఇచ్చే కూలి, పెట్టుబడులు పెరిగిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
  • మరో వైపు కరోనాప్రభావం కూడా రైతులను దెబ్బతీసింది.
  •  మా ప్రభుత్వంలో పరిస్థితులు వ్యవసాయానికి అనుకూలంగా లేకపోయినా కూడా వ్యవసాయ, అనుబంధరంగాల్లో రాష్ట్రం దేశంలోనే 11శాతం వృద్ధి రేటుసాధించింది.
  •  అసలు ఈప్రభుత్వం భూసార పరీక్షలను ఎందుకు నిలిపేసింది?
  •  టీడీపీ హయాంలో పక్కాగా భూసారపరీక్షలు నిర్వహించి, కోటి 20 లక్షల మంది రైతులకు ఉచితంగా భూసార పరీక్ష కార్డులను పం పిణీచేశాము.
  •  భూసారపరీక్షలతో భూమిలోని లోపాలను గుర్తించి, జింక్, బోరాన్, నత్రజని, జిప్సం వంటి ఎరువులను ఉచితంగా రైతులకు అందించాము.
  • అసలు భూసారపరీక్షలు చేయకుం డా ఈప్రభుత్వం రైతులకు ఏం మేలుచేస్తుంది?
  •  మైక్రో ఇరిగేషన్ పథకంలో రైతులందరికీ బిందు, తుంపర్ల సేద్యానికి 90 శాతం సబ్సిడీ అందించాము.
  • ఎస్సీ,ఎస్టీ రైతులకు నూటికినూరుశాతం రాయితీపై బిందు, తుంపరసేద్యం పరికరాలను టీడీపీ ప్రభుత్వం అందించింది.
  • మైక్రో ఇరిగేషన్ పథకంలో కేంద్రప్రభుత్వం 60శాతం రాయితీతో రైతులకు పరికరాలను అందిస్తుంటే, రాష్ట్రవాటాగా 40శాతం ఇవ్వలేక జగన్ ప్రభుత్వం ఆ పథకాన్ని పూర్తిగా అటకెక్కించింది.
  • 2017-18లో రూ.1200కోట్లు బిందుతుంపరసేద్యం కోసం టీడీపీ ప్రభుత్వం ఖర్చుపెట్టింది.
  • నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించడం కోసం చంద్రబాబునాయుడి ప్రభుత్వం రూ.1217కోట్లవరకు ఖర్చుపెట్టింది.
  • ఈ ప్రభుత్వం విత్తనసరఫరాలో పూర్తిగా విఫలమైంది.
  •  టీడీపీ ప్రభుత్వంలో, ప్రకృతివ్యవసాయంలో (ZBNF) రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది..
  • వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల, మరీ ముఖ్యంగా ధాన్యం దిగుబడులకు సంబంధించి, మా హాయాంలో రాష్ట్రానికి కృషి కర్మన్ అవార్డు సాధించాము.
  • ఈ విధంగా వ్యవసాయానికి, రైతులకు అన్నివిధాల అండగాఉండబట్టే, వ్యవసాయ, అనుబంధరంగాల్లో 11 శాతం వృద్ధిరేటు సాధించాము.
  • మరిప్పుడు వ్యవసాయానికి, రైతులకు ఈప్రభుత్వం ఏంచేస్తుందంటే సమాధానంలేదు.
  •  మా హయాంలో ఎన్డీఆర్ఎఫ్ ప్రమాణాల కంటే, రైతులకు ఎక్కువగా ఇన్ పుట్ సబ్సిడీని అందించాం..
  •  దేశంలో రైతులకు మిగతా రాష్ర్రాలు ఇచ్చేదానికంటే ఎక్కువగా, దాదాపు రూ.3,767 కోట్లవరకు ఇన్ పుట్ సబ్సిడీని రైతులకు అందించాము.
  •  ఇన్ పుట్ సబ్సిడీ కింద గతప్రభుత్వం చేసిన చెల్లింపుల్లో కొంత భాగాన్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు అందకుండా దాన్ని నిలిపేసింది.
  •  రూ.4వేలకోట్ల రైతురుణమాఫీ సొమ్ముని రైతులఖాతాల్లోకి చేరకుండా చేసిందికూడా జగన్మోహన్ రెడ్డే.
  •  అప్పుడు ప్రభుత్వప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎన్నికల కమిషన్ తో కలిసి కుట్రచేసి, రైతుల ఖాతాల్లో పడటానికి సిద్ధంగా ఉన్న రూ.4వేల కోట్లను జగన్ నిలిపి వేయించాడు.
  • జగన్ తో కలిసి, రైతులకు అన్యాయంచేసిన అదే, ఎల్ వీ.సుబ్రహ్మణ్యం చివరకు పెట్టే బేడా సర్దుకున్నాడు.
  • ఈ విధంగా రైతులనోట్లో మట్టికొట్టే పనులు తప్ప, జగన్మోహన్ రెడ్డిగానీ, ఆయన ప్రభుత్వంగానీ ఈరెండేళ్లలో వారికి ఏంమేలు చేశాయో చెప్పాలి..
  •  మొన్నటికి మొన్న నెల్లూరులో గ్రామాలకువెళితే, చేపలు, రొయ్యలరైతులు తమగోడు వినిపించారు.
  • యూనిట్ రూ.1.50పైసలు ఉన్న విద్యుత్ ఛార్జీని యూనిట్ రూ.3కు పెంచిందని రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
  •  వ్యవసాయయాంత్రీకరణ పరికరాలపై కేంద్రం 60 శాతం రాయితీ ఇస్తుంటే, దానికింద టీడీపీప్రభుత్వం సంవత్సరానికి రూ.350కోట్లచొప్పున, ఐదేళ్లలో రూ.1750కోట్లు రైతులకోసం ఖర్చుపెట్టింది.
  • ఆ పథకాన్నికూడా జగన్మోహన్ రెడ్డి అటకెక్కించాడు.
  • జగన్మోహన్ రెడ్డికి వ్యవసాయం అనేమాటకు అర్థమే తెలియదు. ఆయ న ఏనాడూ పొలాలముఖంకూడా చూసిందిలేదు.
  • ఈ రెండున్నరేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం రైతులకోసం అమలుచేసే ఏ పథకానికైనా సరే, జగన్ ప్రభుత్వం ఎంతఖర్చుపెట్టిందో సమాధానంచెప్పాలి.
  • విత్తనాలు మొదలు గిట్టుబాటుధర కల్పన వరకు రైతులకు ఇంతఖర్చుపెట్టామని చెప్పగల ధైర్యం ముఖ్యమంత్రికి, వ్యవసాయమంత్రికి ఉన్నాయా?
  • వ్యవసాయంపై ఆధారపడి బతికే 63శాతం కుటుంబాలను రోడ్డునపడేశారు..
  • ఎక్కడ చూసినా రాష్ట్రంలో పూర్తిగా వ్యవస్థలన్నీ పతనమయ్యాయి.
  • దశాబ్దాల నుంచీ రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలను జగన్ ప్రభుత్వ కొనసాగించాల్సిందే..
  • లేదంటే ప్రజలే ఈ ప్రభుత్వానికి తగు గుణపాఠం చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

error: Content is protected !!