వరద సహాయం పై నాడు ప్రతిపక్ష నాయకుడిగా చెప్పింది నేడు ముఖ్యమంత్రి గా ఎందుకు అమలు చేయడం లేదు?

0
Spread the love

వరద సహాయం పై నాడు ప్రతిపక్ష నాయకుడిగా చెప్పింది నేడు ముఖ్యమంత్రి గా ఎందుకు అమలు చేయడం లేదు?

తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

  • – నాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తున్న సహాయం ఏ ములకూ సాలదన్నావు. నేడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన దానిలో సగం కూడా ఇవ్వడం లేదు.
  • – నీట మునిగిన ప్రతి ఇంటికి రూ.25 వేలు ఆర్థిక సహాయం చెయ్యాలి.

కోవూరు, న‌వంబ‌ర్ 23 (స‌దా మీకోసం) :

కోవూరు మండలం పడుగుపాడు గ్రామ పరిధిలోని పెద్ద పడుగుపాడు, ఎన్టీఆర్ నగర్లో కోవూరు మాజీ జడ్పీటీసీ సభ్యులు,తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి పర్యటించి వరద బాధితులను పరామర్శించారు.

ఈ సందర్భంగా చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల వచ్చిన వరదలు వలన పడుగుపాడు తో సహా కోవూరు నియోజకవర్గము లో అనేక గ్రామాలు నీట మునిగాయి. దీని వలన ప్రజలకు అపారమైన నష్టం వాటిల్లిందన్నారు. ఇంత నష్టం జరిగినా ప్రభుత్వం వైపు నుండి కనీస సహాయం కూడా అందలేదు.

ఇంకా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా పునరుద్ధరించలేదని విమ‌ర్శించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వరదలు వచ్చి నప్పుడు నీట మునిగిన ఇళ్లకు వంట పాత్రలు నిమిత్తం రూ.2 వేలు,బట్టల నిమిత్తం రూ.2 వేలు తక్షణ సహాయం ఇచ్చి తదుపరి ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని తెలిపారు.

అయితే నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ సాయం ఏమూలకు సరిపోదని, మీరేమైన ముష్టి ఇస్తున్నారా అని మాట్లాడాడని, కాని నేడు ముఖ్యమంత్రి అయిన తరువాత నాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన సహాయం లో సోగం కూడా ఇవ్వలేదు.నీట మునిగిన ఇంటికి కేవలం రూ.3,800 సహాయం మాత్రమే ప్రకటించారన్నారు.

నాడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతి కుటుంబానికి కనీస సహాయం రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన, జగన్మోహన్ రెడ్డి నాడు తను చెప్పిన మాటకు కట్టుబడి నీట మునిగిన ప్రతి కుటుంబానికి రూ.25 వేలు ఆర్ధిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నదుల రవికుమార్,SK నాసీర్, మహ్మద్, పాశం పాశం పరందామయ్య,SK వాహీద్,వినుకోట జయ,ప్రసాద్,గరికిపాటి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!