“కాకాని” వర్సెస్ “సోమిరెడ్డి”..!

0
Spread the love

“కాకాని” వర్సెస్ “సోమిరెడ్డి”..!

-ఆగని విమర్శల పర్వం…!!

-నలిగిపోతున్న క్యాడర్..!!!

తోటపల్లిగూడూరు, మార్చి 15 (సదా మీకోసం)

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు రాజకీయ ప్రత్యర్ధులు అన్న విషయం “రాష్ట్ర మెరిగిన సత్యం”.

ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నాయకులు పరస్పరం ఒకరిపై మరొకరు ఆరోపణలు సంధించుకుంటుండడం పెద్దగా చెప్పుకోదగ్గ అంశమేమీ కాదు.

అయితే కాగా గత రెండేళ్ల నుంచి వీరి మధ్య నడుస్తున్న మాటల యుద్ధం శృతి మించుతుండడమే గమనించ దగ్గ విషయం. ఈ ఇద్దరు హేమహేమీల మధ్య నడుస్తున్న రాజకీయ విమర్శల పర్వం కాస్త వ్యక్తిగత దూషణల వైపునకు మలుపు తిరగడంతో ఇరు పార్టీల కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

ఈ పరిస్థితి ఎటువైపుకు దారితీస్తుందోనన్న ఉత్కంఠ సర్వేపల్లి నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య నడుస్తున్న రాజకీయ, వ్యక్తిగత విమర్శల నేపథ్యంలో వీరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్న చందంగా మారింది.

ఈ ఇద్దరు హేహామీల మధ్య నడుస్తున్న మాటల యుద్ధానికి ఇప్పుడిప్పుడే ఫుల్ స్టాప్ పడే సూచనలు కనిపించడం లేదన్నది నిర్వివాదాంశం.

నలిగిపోతున్న కార్యకర్తలు.

ఈ రాజకీయ బద్ధ శత్రువులైన గోవర్ధన్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డిల గురించి కాస్త పక్కన బెడితే, ఈ ఇద్దరు రాజకీయ ప్రత్యర్ధుల మధ్య పాపం కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఎలాగంటే “సోమిరెడ్డి”పై విమర్శలు సంధిస్తే వైసీపీ క్యాడర్ ఖండించాలి.

అలాగే “కాకాని”ని విమర్శిస్తే టీడీపీ కార్యకర్తలు కౌంటర్ ఇవ్వాలి.

 

ఇది మామూలు అంశమే. ఈ విమర్శల దాడులు ఎప్పుడో ఒ కప్పుడైతే ఇరు పార్టీల కార్యక ర్తలకు పెద్ద ఇబ్బంది ఉండదు.

అయితే ఈ విమర్శల పర్వం ని త్యకృత్యాల్లో ఒకటి కావడమే కార్యకర్తలకు ఇబ్బందులను తెచ్చిపెడుతోంది పాపం.

ము ఖ్యమైన పనులను సైతం పక్క నబెట్టి కౌంటర్లు ఇచ్చేందు కోసం తమ సమయాన్ని వెచ్చించాల్సి న దుస్థితి ప్రస్తుతం సర్వేపల్లి ని యోజకవర్గంలోని టీడీపీ, వైసీ పీ కార్యకర్తలు, నాయకులకు దాపురించిందని చెప్పవచ్చు.

ఇ దిలా వుంటే ఈ నేతల మధ్య ని రాటంకంగా కొనసాగుతున్న వి మర్శల పర్వం హుందాగా కా కుండా శృతిమించి అనే కంటే మరింత దిగజారి ఆసబ్య పద జాలంతో వ్యక్తి గతంగానే కా కుండా కుటుంబ సభ్యులను కూడా వీధుల్లోకి లాగుతుండ డాన్నిఇరు పార్టీల కార్యకర్తలే జీర్ణించుకోలేక పోతున్నారు.

అంతేకాక ఈ బడా నాయకుల మధ్య శృతి మించుతున్న ఈ దూషణలు, విమర్శల్లో పర్వా ల్లో పాలుపంచుకో రావాల్సిన పరిస్థితుల్లో భవిష్యత్తులో ఎటు వంటి విపత్కర పరిణామాలు ఎదుర్కోవ లసి వస్తుందోనన్న ఆందోళన ఇరు పార్టీల కార్యక ర్తల్లో లేకపోలేదు.

దాంతో “విడ వమంటే పాముకు, కరవమంటే కప్పకు కోపం” అన్న చందంగా ఇరు పార్టీల కార్యకర్తల పరిస్థితి వుంది. పైకి తమ అభిప్రాయాల ను వ్యక్తం చేసే అవకాశం ఏ మాత్రం లేకపోయినా,రాజకీయ ప్రత్యర్ధులైన కాకాని, సోమిరెడ్డి ల మధ్య నడుస్తున్న విమర్శల పర్వానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడితే బాగుంటుందన్న అభిప్రా యం కార్యకర్తలు అంతరంగా న్ని తొలిచేస్తోందని వినికిడి.

ఏ దిఏమైనా సర్వేపల్లినియోజక వర్గం ఎమ్మెల్యే “కాకాని”, మాజీ మంత్రి “సోమిరెడ్డి”ల మధ్య గ త రెండేళ్లుగా గతి తప్పి కొనసా గుతున్న విమర్శల పర్వం నేప ద్యంలో ఇరు పార్టీల కార్యకర్త లు, నాయకులు నలిగిపోతు న్నారన్న ప్రచారం సర్వేపల్లి ని యోజకవర్గంలో సాగుతుండ డం గమనార్హం.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!