వైసీపీ చరమగీతం పాడేందుకు మహిళా లోకం సిద్దమైంది : మాజీ మంత్రి సోమిరెడ్డి
వైసీపీ చరమగీతం పాడేందుకు మహిళా లోకం సిద్దమైంది
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి
- – మహిళలను అగౌరవపరిస్తే ఎదురయ్యే పరిణామాలను వైసీపీ నేతలు చూడబోతున్నారు .
కడప, నవంబర్ 23 (సదా మీకోసం) :
కడప జిల్లా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డిని దీప్తి మర్యాదపూర్వకంగా కలిసింది.
ఏపీ అసెంబ్లీలో నారా భువనేశ్వరికి జరిగిన అవమానం, నారా చంద్రబాబు నాయుడు భావోద్వేగాన్ని తట్టుకోలేక వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల తీరుకు నిరసనగా ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగానికి దీప్తి రాజీనామా చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, దీప్తి రాజీనామా వైసీపీ నాయకుల తీరుకు చెంపదెబ్బ అని అన్నారు.
నెలకు రూ.40వేలకు పైగా జీతం, కుటుంబ భవిష్యత్తును కూడా ఖాతరు చేయకుండా సాటి మహిళకు జరిగిన అవమానానికి తీవ్రస్థాయిలో నిరసన తెలిపారన్నారు.
దీప్తికి మంచి భవిష్యత్ ఉండాలని మనసారా కోరుకుంటున్నానని, అసెంబ్లీలో జరిగిన పరిణామాలకు ప్రతీ మహిళ కన్నీరు పెట్టుకుంటోందని తెలిపారు.
అయినా మంత్రులు ఇంకా సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అమరావతి కోసం పోరాడే మహిళలను కించపరిచేలా కామెంట్స్ చేయడం దుర్మార్గమని, వైసీపీ నాయకులకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గర పడిందన్నారు.