రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధిస్తుంది
మంత్రి అనిల్ నెల్లూరు నగరాన్ని భ్రష్టు పట్టించాడు
తెలుగుదేశం పార్టీ నగరం ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
నెల్లూరు నగరం, ఫిబ్రవరి 16 (సదా మీకోసం) :
నెల్లూరు నగరం, రూరల్ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీ తో గెలవబోతున్నమని తెలుగుదేశం పార్టీ నగరం ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
నెల్లూరు నగరం 7వ డివిజన్ నందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌరవసభలు నిర్వహించారు.
అనంతరం కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ, మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి కూతురు భువనేశ్వరమ్మను దేవాలయం లాంటి శాసనసభలో అవమానించిన వైసిపి నాయకులు సర్వ నాశనం కాక తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రామారావు గారి కూతురికే ఇలా జరిగితే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
నిండు సభలో మహిళలను కించపరుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం మౌనంగా నవ్వుకుంటూ ఉండడం బాధాకరమన్నారు.
నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేయడంలో మంత్రి అనిల్ విఫలమయ్యాడని, మంత్రి అనిల్ మాయమాటలు నమ్మి ఓట్లు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని వివరించారు.
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్ళపాక అనురాధ, పట్టణ అధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు కపీరు శ్రీనివాసులు రేవతి వార్డు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.