మూడవ వేవ్ పై జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలి : సమాచార శాఖ డీడీ వెంకటేశ్వర రావు

0
Spread the love

మూడవ వేవ్ పై జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలి : సమాచార శాఖ డీడీ వెంకటేశ్వర రావు

– కలెక్టర్ ఆధ్వర్యంలో అర్హులైన వారికి అక్రిడిటేషన్ కార్డులు

– ఏపీఈజేయూ ఆధ్వర్యంలో విలేకర్లకు ఆనందయ్య మందు పంపిణీ

నెల్లూరు,జూలై 15 (స‌దా మీకోసం) : కరోనా మహమ్మారి ఉధృతి ఎక్కువగా ఉందని, ప్రస్తుతం కొంత మేర ప్రభావం తగ్గినా మళ్లీ మూడవ వేవ్ ప్రమాదం పొంచి ఉందని జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని సమాచార, పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర రావు పేర్కొన్నారు.

బోనిగి ఆనందయ్య మందు పంపిణీ కార్య‌క్ర‌మం ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఏపీఈజేయూ) రాష్ట్ర క‌న్వీన‌ర్‌, గ‌ట్టుప‌ల్లి శివ‌కుమార్‌, జిల్లా క‌న్వీన‌ర్ ఉడ‌తా రామ‌కృష్ణ‌ల‌ ఆధ్వర్యంలో జ‌రిగింది.

కార్య‌క్ర‌మంలో యూనియ‌న్‌ సభ్యులకు గురువారం సాయంత్రం నెల్లూరు న‌గ‌రంలోని ఎల్‌.ఐ.సి ఆఫీసు ఎదురుగా ఉన్న స్ప్రెడ్ న్యూస్ పత్రిక కార్యాలయం సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ వేంకటేశ్వర ప్రసాద్, ఆనందయ్య సోదరులు బొనిగి శీన‌య్య ల‌ ద్వారా ఆంద్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లాలోని స్థానిక పత్రికల సంపాదకులకు, జర్నలిస్టులకు కృష్ణపట్నం ఆనందయ్య మందును పంపిణీ చేశారు

కార్యక్రమంలో ముఖ్య అథిదిగా పాల్గొన్న డీడీ వెంకటేశ్వర రావు జర్నలిస్టులకు కరోనా మందు ప్యాకెట్ లను అందజేశారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ ఏపీఈజేయూ ఎడిట‌ర్లు జ‌ర్న‌లిస్టుల కోసం గ‌తంలో కూడా మంచి కార్య‌క్ర‌మాలు చేసింద‌ని కొనియాడారు.

క‌రోనా మూడ‌వ వేవ్ వ‌స్తుంద‌ని వ‌స్తున్న ఊహాగానాల నేప‌థ్యంలో ఆనంద‌య్య మందు ఎడిట‌ర్లు, జ‌ర్న‌లిస్టుల‌కు పంచాల‌నే మంచి నిర్ణ‌యం తీసుకున్న నాయ‌కులు అభినంద‌న‌లు తెలిపారు.

స్థానిక పత్రికల సంపాదకులకు, జర్నలిస్టులకు కరోనా మందు అందజేయాలనేది మంచి నిర్ణయం అన్నారు.

జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామన్నారు.

ఏపీఈజేయూ రాష్ట్ర, జిల్లా కో కన్వీనర్లు గట్టుపల్లి శివకుమార్, ఉడతా రామకృష్ణలు మాట్లాడుతూ స్థానిక పత్రికల సంపాదకులకు, జర్నలిస్టులకు కరోనా మందు అందజేయాలని బొనిగి ఆనందయ్యని, ఆయ‌న సోదరులు బొనిగి శీనయ్యను కోరామ‌ని వారు అందజేయడంతో పాటు స్వయంగా కార్యక్రమంలో బొనిగి శీన‌య్య పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.

స్థానిక పత్రికల సంపాదకులు, జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేశామని భవిష్యత్తులో జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ అడ్ హాక్ కమిటీ చైర్మన్ వేల్పుల‌ శేషా చలపతి, యూనియన్ కో కన్వీనర్ రమేష్ రెడ్డి, ఏపీఈజేయు తాజా మాజీ కోశాధికారి పిగిలం నాగేంద్ర సభ్యులు ఎస్ కే ఆలీ, తిరుమలేష్, వరప్రసాద్, ఎస్డీ జావిద్, నీళ్ల చిన్నారావు యాదవ్, సి.హెచ్. శివ, ఉదయ్ కుమార్ రెడ్డి, జ‌ర్న‌లిస్ట్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు.

 

 

   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!