సంక్షేమ పధకాలపై ఆరాతీసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
నెల్లూరు రూరల్, ఏప్రిల్ 13 (సదా మీకోసం) :
“జగనన్న మాట – గడప గడపకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాట” కార్యక్రమం రూరల్ నియోజకవర్గ పరిధిలోని గొల్లకందుకూరు గ్రామంలో 3వ రోజు నిడారంబరంగా ప్రారంభమైంది.
గతరాత్రి గొల్లకందుకూరు ఎస్.సి. కాలనీలోని ప్రాధమికోన్నత పాఠశాలలో సామూహిక నిద్రచేసి, నేటి ఉదయం మహేంద్ర ఇంటి నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) తన కార్యక్రమం 3వ రోజు ప్రారంభించారు.
గొల్లకందుకూరు గ్రామంలో ఇప్పటివరకు 7.16 కోట్ల రూపాయలతో సంక్షేమ పధకాలు, 2.12 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. ఇంకా మిగిలిఉన్న పనులు త్వరలో పూర్తిచేస్తామని తెలిపారు.
ఉదయం 7 గంటల నుండి నేరుగా ప్రజల ఇంటికి వెళ్ళి గడప తట్టి పలకరించి, వారి ఇంట్లోనే కూర్చోని కుటుంబ సభ్యులతో మాట్లాడి, ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పధకాలపై ఆరాతీసి, అనంతరం వారు ఎదుర్కొంటున్న సమ్యలను తెలుసుకున్నారు.