మహిళల మాంగల్యాలను తెంచే ఈ “జే” బ్రాండ్లు పోవాలి : మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ డిమాండ్

0
Spread the love

మహిళల మాంగల్యాలను తెంచే ఈ “జే” బ్రాండ్లు పోవాలి..!

  • జే ‘ బ్రాండ్స్ పోవాలి., ప్రజల ప్రాణాలు నిలవాలి..!
  • అమ్మ ఒడి ఇచ్చి జే బ్రాండ్ లతో పిల్లలకు నాన్న ఒడిని దూరం
  • జగన్ బ్రాండ్స్ వచ్చాయి సంసారాలు బుగ్గి
  • ఎన్నికల ముందు మధ్య నిషేధం అంటూ ప్రజలకు హామీ
  • అధికారంలో వచ్చిన తరువాత దేశమంతా దొరికే మద్యం బ్రాండ్లను మాత్రమే నిషేదం
  • జే బ్రాండ్స్ అంటూ ప్రపంచంలోనే ఎక్కడ దొరకని ఒక కల్తీ మద్యం తయారు
  • ప్రజలు ప్రాణాలను హరిస్తున్న జగన్ ప్రభుత్వం
  • ‘జగన్ మాటలకు అర్ధాలు వేరయా..
  • కల్తీ సారాయి, జె-బ్రాండ్స్‌ మద్యం రకాలను అరికట్టాలి
  • మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ డిమాండ్

పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డి గూడెంలో 18 మంది ప్రజల మరణానికి కారణమైన కల్తీ మద్యంపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి టీడీపీ రెండు రోజులు రాష్ట్రమంతా నిరసన దీక్షలకు పిలుపునిచ్చింది.

ఈ నేపథ్యంలో ఆదివారం గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని పాత నిమ్మకాయల కొట్టు సమీపంలో ఉన్న ప్రభుత్వం నడిపే మద్యం దుకాణాల ఎదుట ‘జే’ బ్రాండ్లకు సంబంధించిన మద్యం బాటిల్స్ ని కొనుగోలు చేసి వాటిని పగలగొట్టి టీడీపీ మహిళా నేతలు,నాయకులు,కార్యకర్తలు తమ నిరసనను తెలియజేసారు.

ముందుగా టీడీపీ కార్యాలయంలో నుండి పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ మద్యం మరణాలను ఉద్దేశించి ప్రభుత్వాన్ని నిలదీసారు.

“అమ్మ ఒడి ఇచ్చి జే బ్రాండ్ లతో పిల్లలకు నాన్న ఒడిని దూరం చేసాడు ఈ ముఖ్యమంత్రి., జగన్ బ్రాండ్స్ వచ్చాయి సంసారాలు బుగ్గి చేశాయి., మహిళల మాంగల్యాలను తెంచే ఈ జే బ్రాండ్లు పోవాలి… ప్రజల ప్రాణాలు నిలవాలి..!”

అంటూ కార్యకర్తలతో సహా నిరసన ర్యాలీలు చేసినట్లు తెలిపారు. నాటు సారా కంటే ప్రమాదకరమైన లిక్కర్ అమ్ముతూ ప్రజల ప్రాణాలపై చిల్లర ఏరుకుంటున్న నత్తి పకోడీ, జ్యూమాంజి మద్యపాన నిషేధం కోసం ఊకదంపుడు ఉపన్యాసాలివ్వడం సూపర్.,*

ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్ వంటి బ్రాండ్లతో ప్రజల రక్తాన్ని పిలుస్తున్న నత్తి పకోడీ ., ఈ బ్రాండ్ల మద్యాన్నే జ్యూమాంజీల గొంతులో పోస్తే రాష్ట్రానికి పట్టిన పీడా పోతుంది అని తనదైన స్టైల్ లో ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఎన్నికల ముందు మధ్య నిషేధం అంటూ ప్రజలకు హామీలిచ్చి., అధికారంలో వచ్చిన తరువాత దేశమంతా దొరికే మద్యం బ్రాండ్లను మాత్రమే నిషేధించి, జే బ్రాండ్స్ అంటూ ప్రపంచంలోనే ఎక్కడ దొరకని ఒక కల్తీ మద్యాన్ని తయారు చేసి ప్రజలు ప్రాణాలను హరిస్తున్న ఈ జగన్ ప్రభుత్వం రానున్న రోజులలో ఏపీలో నిషేధించబడింది అంటూ సెటైర్లు వేస్తున్నారు. ‘జగన్ మాటలకు అర్ధాలు వేరయా’ అని ప్రజలు ఎద్దవా చేస్తున్నారు అంటే ఇందుకే కాబోలు.

జె బ్రాండ్స్‌ పోవాలి-జగన్‌ రెడ్డి దిగిపోవాలి

‘ జె బ్రాండ్స్‌ పోవాలి-జగన్‌ రెడ్డి దిగిపోవాలి ‘ అంటూ… టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పాశం అన్నారు.రాష్ట్రంలో కల్తీ సారాయి, జె-బ్రాండ్స్‌ రకాల విక్రయాలు మద్యం దుకాణాలలోఅరికట్టాలన్నీ డిమాండ్ చేశారు. కల్తీ సారాయి కారణంగా చోటుచేసుకుంటున్న మరణాలను ప్రభుత్వం గుర్తించాలని, ముఖ్యమంత్రి డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ గూడూరు మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర్లరాజు,నెల్లబల్లి భాస్కర్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ టీడీపీ మహిళ అధ్యక్షరాలు మట్టం శ్రావణి, రాష్ట్ర మహిళ కార్యదర్శి గుండాల లీలావతి, తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి బిల్లుచెంచురామయ్య, పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు, రవీంద్ర రెడ్డి, పల్లె కోటేశ్వరరావు,మండల కమిటీ సభ్యులు చిరంజీవి, వెంకటేశ్వర్లునాయుడు,మునిశేఖర్ గౌడ్,కృష్ణా రెడ్డి, నాయకులు నాగరాజు, మండల బిసి,ఎస్సి సెల్ సభ్యులు గ్రామ కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

error: Content is protected !!